రాత్రి 9.30 తర్వాతే డ్రంకెన్‌ డ్రైవ్‌లు

ABN , First Publish Date - 2021-03-05T07:05:08+05:30 IST

డ్రంకెన్‌ డ్రైవ్‌... రోడ్డు బ్లాక్‌ శీర్షికన

రాత్రి 9.30 తర్వాతే డ్రంకెన్‌ డ్రైవ్‌లు

సిబ్బందిని ఆదేశించిన ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): డ్రంకెన్‌ డ్రైవ్‌... రోడ్డు బ్లాక్‌ శీర్షికన గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు స్పందించారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల లోపు ఎక్కడెక్కడ డ్రంకెన్‌ డ్రైవ్‌లు నిర్వహించారనే అంశాలపై ఆరా తీశారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించడానికి అది సరైన సమయం కాదని నిర్ణయించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో రాత్రి 9.30 గంటల తర్వాతనే డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించాలనే పద్ధతి ఇప్పటికే అమల్లో ఉందని, కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఉంటారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మందుబాబులు కూడా రాత్రి 10 తర్వాతనే రోడ్డు మీదకు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని పోలీసులు సైతం భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ఏ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోనైనా రాత్రి 9.30 గంటల తర్వాతే డ్రంకెన్‌ డ్రైవ్‌ చెకింగ్‌లు నిర్వహించాలని సిబ్బందికి ఉన్నతాధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-03-05T07:05:08+05:30 IST