Abn logo
Mar 30 2020 @ 05:45AM

డ్వాక్రా రుణాల కంతు చెల్లింపుపై స్పష్టత రావాలి

డీఆర్డీఏ పీడీ మురళి


చిత్తూరు అర్బన్‌, మార్చి 29: డ్వాక్రా రుణాల కంతు చెల్లింపుపై స్పష్టత రావాల్సి ఉందని డీఆర్డీఏ పీడీ మురళి తెలిపారు. ఇప్పటికే బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దాంతో డ్వాక్రా మహిళలు కూడా తమకు ఈ అవకాశం వర్తిస్తుందని భావిస్తున్నారు. దీనిపై పీడీని సంప్రదించగా.. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం వెలువడలేదన్నారు. ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కాగా.. ప్రతినెలా పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్లను ఏప్రిల్‌ ఒకటో తేదీనే లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల వేలిముద్రలు అవసరం లేకుండా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు అందుతాయని.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

Advertisement
Advertisement