పంచాయతీరాజ్‌లోకి డీఆర్‌డీఏ విలీనం!

ABN , First Publish Date - 2021-02-26T04:19:19+05:30 IST

డీఆర్‌డీఏ సంస్థ ద్వారా జరిగే కార్యాకలపాలు ఇక నుంచి పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరగనున్నాయి. విలీనానికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది.

పంచాయతీరాజ్‌లోకి డీఆర్‌డీఏ విలీనం!

విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఫిబ్రవరి25 : డీఆర్‌డీఏ సంస్థ ద్వారా జరిగే కార్యాకలపాలు ఇక నుంచి  పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరగనున్నాయి. విలీనానికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. డీఆర్‌డీఏ ద్వారా ప్రస్తుతం అందిస్తున్న పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా అమలు కానున్నట్లు తెలిసింది.  ఈ మేరకు గురువారం అమరావతిలో సెర్ఫ్‌ సీఈవో   జరిగిన సమావేశానికి డీఆర్‌ డీఏ పింఛన్‌ శాఖలో ఏపీడీగా పనిచేస్తున్న ప్రసాద్‌ ఈ సమావేశానికి హాజర య్యారు. రెండు రోజులు పాటు జరిగే సమావేశంలో విలీనానికి సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు. అదే విధంగా  పింఛన్ల విభాగంలో విధులు నిర్వహి స్తున్న 15 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, మరింతమంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది కూడా పంచాయతీరాజ్‌శాఖలో విలీనం కానున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు జిల్లా లో 3లక్షల 39వేల, 119 మంది పింఛనర్లు ఉన్నారు. వీరి కోసం ప్రతినెలా రూ.81.33 కోట్లు  వెచ్చిస్తున్నారు. వలంటీర్ల ద్వారా గ్రామలు, పట్టణాల్లో పింఛన్లు అందిస్తున్న సంగతి విదితమే.  ఇదే అంశంపై డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావును వివ రణ  కోరగా డీఆర్‌డీఏను  పంచాయతీరాజ్‌ శాఖలో విలీనం చేసేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైందన్నారు. విధివిధానాలు అందాల్సి ఉందని తెలిపారు. 

 

Updated Date - 2021-02-26T04:19:19+05:30 IST