Kodela బాటలో మరో డాక్టర్.. రూపాయికే వైద్యం.. వచ్చే ఎన్నికల్లో ప్రజల నాడి పడతారా..!?

ABN , First Publish Date - 2021-12-20T18:32:05+05:30 IST

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రాజకీయాలకు అతీతంగా వైద్య సేవలు అందిస్తుంటారు. అధికార పార్టీ నాయకులు సైతం...

Kodela బాటలో మరో డాక్టర్.. రూపాయికే వైద్యం.. వచ్చే ఎన్నికల్లో ప్రజల నాడి పడతారా..!?

ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న ఆ డాక్టర్‌ పేదల ప్రాణదాతగా పేరొందారు. ఆయన రాజకీయాల్లో కొనసాగుతుండటంతో ఉచితంగానే వైద్య సేవలు చేస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రాజకీయాలకు అతీతంగా వైద్య సేవలు అందిస్తుంటారు. అధికార పార్టీ నాయకులు సైతం విపక్ష పార్టీకి చెందిన ఆ నేత హస్తవాసి మంచిదని భావించి.. రాజకీయాలను పక్కనపెట్టి మరీ చికిత్స పొందుతున్నారు. ఇంతకీ ఎవరా డాక్టర్‌? ఎక్కడా ఉచిత వైద్య కేంద్రం? వివరాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.




వచ్చే ఎన్నికల్లో ఓటరు నాడి పడతారా..!?

ఇదిలావుంటే.. డాక్టర్‌ చదలవాడ అరవింద్ బాబు హస్తవాసి మంచిదని రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు కూడా వైద్యం చేయించుకునేందుకు వస్తుండటం గమనార్హం. అధికార వైసీపీకి చెందిన కొందరు రాజకీయాలను పక్కనపెట్టి.. ఆయన వద్దకెళ్లి చికిత్స చేయించుకుంటుండటం గమనార్హం. మొత్తంమీద, డాక్టర్‌గా ప్రజల నాడి తెలుసుకున్న చదలవాడ అరవింద్‌ బాబు.. మరి వచ్చే ఎన్నికల్లో ఓటరు నాడి పట్టగలరో లేదో చూడాలి.


ఓవైపు వైద్యం.. మరోవైపు రాజకీయం..

నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వారు.. అరవింద్‌ ఉచిత వైద్య కేంద్రానికి నిత్యం చికిత్స కోసం వస్తూనే ఉంటారు. ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జిలు.. తమతమ ప్రాంతాల పరిధిలో ఏ బాధితుడు ఉన్నా.. నరసరావుపేటలోని అరవింద్ బాబు ఆసుపత్రికే పంపిస్తూ వైద్యం చేయిస్తున్నారు. సొంత పార్టీ వారు కావడం, అందులోనూ ఎక్కువగా పేదలు వైద్యం చేయించుకోవడంతో చాలా వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అరవింద్‌ ఓ వైపు నరసరావుపేట పార్టీ వ్యవహారాలు చూస్తూనే.. మరోవైపు పేదలకు, పార్టీకి చెందినవారికి వైద్యపరంగా అండగా నిలవడం.. టీడీపీ హైకమాండ్‌ దృష్టిలో పడినట్లుగా తెలుస్తోంది.


ఎవరీయన..!?

చదలవాడ అరవింద్ బాబుకు నరసరావుపేటలో ఆర్థోపెడిక్‌ డాక్టర్‌గా మంచి పేరుంది. పల్నాడు ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలో ఎక్కడ రాజకీయ గొడవలు జరిగినా, రోడ్డు ప్రమాదాలు సంభవించినా.. ఆ ఘటనల్లో గాయపడిన, దెబ్బతిన్నవారిలో చాలామంది పేదలు చదలవాడ అరవింద్‌ ఉచిత వైద్య కేంద్రానికే వస్తుంటారు. బాధితులు ఎవ్వరూ వచ్చినా.. వారికి డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబు ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందించి మనోధైర్యాన్ని కూడా ఇస్తున్నారు. ఇక పార్టీ తరపున ఎవ్వరూ ఆసుపత్రికి వచ్చినా... ఆర్థిక భారాన్ని కూడా తానే భరించి మరీ చికిత్స చేస్తున్నారని పార్టీలో పేరు తెచ్చుకున్నారు. 


కోడెల బాటలోనే..

గుంటూరు జిల్లా నరసరావుపేట. ఇది రాజకీయ హత్యలతో అట్టుడికిన గడ్డ. కులాల కుంపటికి పెట్టింది పేరు ఈ నియోజకవర్గం. బాంబుల మోతతో దద్దరిల్లిన ప్రాంతం. ఇలాంటి చోట దివంగత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు రూపాయి డాక్టర్‌గా పేరు గాంచారు. అదే ప్రతిష్టతోనే ఆయన తెలుగుదేశం ఆవిర్భావం సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనేక పదవుల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కూడా కోడెల శివప్రసాదరావు బాటనే అనుసరిస్తూ... రాజకీయాలలో రాణిస్తున్నారు.

Updated Date - 2021-12-20T18:32:05+05:30 IST