అంకెలతో డ్రాయింగ్‌!

ABN , First Publish Date - 2022-06-06T07:09:02+05:30 IST

ముందుగా బొమ్మలో చూపిన విధంగా డ్రాయింగ్‌ షీట్‌పై పెన్సిల్‌ సహాయంతో 1 నుంచి 5 వరకు అంకెలు గీయాలి.

అంకెలతో డ్రాయింగ్‌!

కావలసినవి

ఏ-4 సైజు డ్రాయింగ్‌ షీట్‌, పెన్సిల్‌, ఎరేజర్‌, బ్లాక్‌ మార్కర్‌, స్కెచ్‌పెన్నులు.


ఇలా చేయాలి...

ముందుగా బొమ్మలో చూపిన విధంగా డ్రాయింగ్‌ షీట్‌పై పెన్సిల్‌ సహాయంతో 1 నుంచి 5 వరకు అంకెలు గీయాలి.

ఇప్పుడు ఒకటో అంకెను చెట్టుగా గీయండి. రెండో అంకెను బాతుగా, మూడు అంకెలను సీతాకోకచిలుకలుగా, నాలుగో అంకెను పడవగా, ఐదు అంకెలను ఆపిల్స్‌గా గీయండి.

పెన్సిల్‌ అవుట్‌లైన్‌పై మార్కర్‌తో గీయండి. 

చివరగా స్కెచ్‌పెన్నుల సహాయంతో రంగులు వేస్తే బొమ్మ రెడీ. 

Updated Date - 2022-06-06T07:09:02+05:30 IST