వేసవి విజ్ఞాన శిబిరంలో డ్రాయింగ్‌ శిక్షణ

ABN , First Publish Date - 2022-05-27T06:16:44+05:30 IST

ఎంజీ రోడ్డులోని ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో గురువారం విద్యార్థులకు డ్రాయింగ్‌, సంగీతం క్లాసులు నిర్వహించారు.

వేసవి విజ్ఞాన శిబిరంలో డ్రాయింగ్‌ శిక్షణ

వేసవి విజ్ఞాన శిబిరంలో డ్రాయింగ్‌ శిక్షణ

గవర్నర్‌పేట, మే 26: ఎంజీ రోడ్డులోని ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో గురువారం విద్యార్థులకు డ్రాయింగ్‌, సంగీతం క్లాసులు నిర్వహించారు. డ్రాయింగ్‌ మాస్టర్‌ మల్లిక్‌ ఆధ్వర్యంలో డ్రాయింగ్‌ వేయడంలో మెలకువలను పిల్లలకు నేర్పించారు. సంగీత కళాకారుడు గోపాలకృష్ణ సంగీతం, సాంగ్స్‌లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ జమల పూర్ణమ్మ శిబిరాన్ని సందర్శించారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు అందించే శిక్షణలో పాల్గొని మెళకు వలు నేర్చుకోవాలని కోరారు. ఠాగూర్‌ గ్రంథాలయ గ్రేడ్‌-2 లైబ్రేరియన్‌ ఏ. రామచంద్రుడు శిక్షణ  శిబిరాన్ని పర్యవేక్షించారు.

Updated Date - 2022-05-27T06:16:44+05:30 IST