ఈజీగా ఎకిడ్నా!

ABN , First Publish Date - 2020-04-30T06:42:32+05:30 IST

ఈ క్షీరదం పేరేంటో తెలుసా? ఎకిడ్నా! ఆస్ట్రేలియా, న్యూ గినియా ప్రాంతాల్లో కనిపించే ఈ అతిచిన్న క్షీరదం బొమ్మను ఈ రోజు తయారుచేద్దామా...

ఈజీగా ఎకిడ్నా!

ఈ క్షీరదం పేరేంటో తెలుసా? ఎకిడ్నా! ఆస్ట్రేలియా, న్యూ గినియా ప్రాంతాల్లో కనిపించే ఈ అతిచిన్న క్షీరదం బొమ్మను ఈ రోజు తయారుచేద్దామా...


కావలసినవి

  1. పేపర్‌ ప్లేట్‌
  2. జిగురు
  3. పేయింట్‌ బ్రష్
  4. కత్తెర
  5. బ్రౌన్‌ కలర్‌ పేపర్
  6. బ్రౌన్‌ కలర్‌
  7. బ్లాక్‌ కలర్


ఇలా చేయండి...

  1. ముందుగా పేపర్‌ ప్లేట్‌కు బ్రష్‌ సహాయంతో బ్రౌన్‌ కలర్‌ వేయండి.
  2. బొమ్మలో చూపించిన విధంగా పేపర్‌ ప్లేట్‌ను కత్తిరించండి.
  3. పేపర్‌ప్లేట్‌ వంపు తిరిగి ఉన్న వైపు, బొమ్మలో చూపించిన విధంగా చిన్న చిన్నగా కత్తిరించండి.
  4. బ్రౌన్‌ కలర్‌ పేపర్‌పై ఎకిడ్నా ముఖం, కాళ్లు, ముక్కు, కనుబొమ్మ గీసి కత్తిరించండి. 
  5. ఆ భాగాలను పేపర్‌ ప్లేట్‌కు బొమ్మలో చూపించిన విధంగా సరిగ్గా అతికించండి. 
  6. కనుబొమ్మను అతికించండి. కన్ను గీయండి. కాళ్లకు గోళ్లు కనిపించేలా నలుపు రంగు వేయండి. అంతే... ఎకిడ్నా రెడీ.

Updated Date - 2020-04-30T06:42:32+05:30 IST