ద్రావిడ్‌ మాలో స్ఫూర్తి నింపాడు: ఇర్ఫాన్‌ పఠాన్‌

ABN , First Publish Date - 2020-06-01T09:34:41+05:30 IST

భారత కెప్టెన్లలో రాహుల్‌ ద్రావిడ్‌ అంటే తనకు చాలా ఇష్టమని మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. 2007 వన్డే వరల్డ్‌క్‌పలో దారుణ ఓటమి తర్వాత తనతో పాటు ధోనీ, ఇతర ఆట గాళ్లను రాహుల్‌ సినిమాకు తీసుకెళ్లాడని, అలాగే ఆత్మవిశ్వాసం

ద్రావిడ్‌ మాలో స్ఫూర్తి నింపాడు: ఇర్ఫాన్‌ పఠాన్‌

న్యూఢిల్లీ: భారత కెప్టెన్లలో రాహుల్‌ ద్రావిడ్‌ అంటే తనకు చాలా ఇష్టమని మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. 2007 వన్డే వరల్డ్‌క్‌పలో దారుణ ఓటమి తర్వాత తనతో పాటు ధోనీ, ఇతర ఆట గాళ్లను రాహుల్‌ సినిమాకు తీసుకెళ్లాడని, అలాగే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉత్తేజం నింపాడని చెప్పాడు. ‘నా తొలి కెప్టెన్‌ గంగూలీ. అతడు నాకు అండగా నిలిచాడని చాలా మందికి తెలుసు. అయితే, రాహుల్‌ ద్రావిడ్‌ నాయకత్వంలో ఆడేందుకు నేను చాలా ఇష్టపడేవాణ్ణి. అతడి హయాంలో చక్కటి కమ్యూనికేషన్‌ ఉండేది. 2007లో గ్రూప్‌ దశలోనే ఓడి నిరాశలో ఉన్న మమ్మల్ని ద్రావిడ్‌ ‘300’ మూవీకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నాతో మాట్లాడుతూ.. ఇర్ఫాన్‌... ఈ ఓటమితో ప్రపంచం అంతం కాదు. నీవు, ధోనీ ఇంకా చాలా క్రికెట్‌ ఆడాల్సి ఉంది’ అని ధైర్యం నింపాడని పేర్కొన్నాడు.

Updated Date - 2020-06-01T09:34:41+05:30 IST