ద్రాక్షారామ భీమేశ్వరాలయం మూసివేత

ABN , First Publish Date - 2021-04-22T06:17:36+05:30 IST

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ ఉత్తర్వుల మేరకు దేవదాయశాఖ ఉన్నతాధికారుల సూచనతో ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని మూసివేసినట్టు సహాయ కమిషనరు, ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్వీడీవీ ప్రసాద్‌ తెలిపారు.

ద్రాక్షారామ భీమేశ్వరాలయం మూసివేత
భీమేశ్వరాలయం ద్వారాలు మూసివేసిన దృశ్యం

ద్రాక్షారామ, ఏప్రిల్‌ 21: కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ ఉత్తర్వుల మేరకు దేవదాయశాఖ ఉన్నతాధికారుల సూచనతో ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని మూసివేసినట్టు సహాయ కమిషనరు, ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్వీడీవీ ప్రసాద్‌ తెలిపారు. గురువారం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించమన్నారు. నిత్యపూజలను అర్చకులు యథావిధిగా నిర్వహిస్తారన్నారు.

Updated Date - 2021-04-22T06:17:36+05:30 IST