కాల్వను తలపిస్తున్న ఆకివీడు పట్టణ రహదారులు

ABN , First Publish Date - 2022-09-16T05:31:59+05:30 IST

పట్టణంలో పది నిమిషాలు ఏకధాటిగా వర్షం పడితే రహదారులన్నీ కాల్వలను తలపిస్తాయి.

కాల్వను తలపిస్తున్న ఆకివీడు పట్టణ రహదారులు
పెద్దింట్లమ్మ వీధిలో వర్షపునీటిలో వెళుతున్న విద్యార్థినులు

ఆకివీడు, సెపెటంబరు 15: పట్టణంలో పది నిమిషాలు ఏకధాటిగా వర్షం పడితే రహదారులన్నీ కాల్వలను తలపిస్తాయి. పట్టణ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ డ్రెయిన్లు పూడుకుపోయి.. ఆక్రమణలకు గురికావడంతో నీరు పారడం లేదు. కొద్దిపాటి వర్షానికే రోడ్లు మునిగిపోతున్నాయి. మురుగు కూడీ వర్షం నీటితో కలిసి అనారోగ్య పరిస్థితులు నెలకొంటున్నాయి. మున్సిపల్‌ అధికారులు స్పందించి డ్రెయినేజీ సమస్య పరిష్కరించాలి.



Updated Date - 2022-09-16T05:31:59+05:30 IST