డాక్టర్‌ విజయలక్ష్మికి Cm Stalin అభినందన

ABN , First Publish Date - 2022-06-01T16:27:51+05:30 IST

ముఖ్యమంత్రి స్టాలిన్‌ డెల్టా జిల్లాల పర్యటనలో భాగంగా మైలాడుదురై జిల్లా తిరుక్కడయూరులో చేపలను శుభ్రం చేయడం ద్వారా వచ్చిన సంపాదనతో కుమార్తెను రష్యా

డాక్టర్‌ విజయలక్ష్మికి Cm Stalin అభినందన

చెన్నై: ముఖ్యమంత్రి స్టాలిన్‌ డెల్టా జిల్లాల పర్యటనలో భాగంగా మైలాడుదురై జిల్లా తిరుక్కడయూరులో చేపలను శుభ్రం చేయడం ద్వారా వచ్చిన సంపాదనతో కుమార్తెను రష్యా పంపి డాక్టర్‌ చదివించిన మాతృమూర్తి రమణిని కలుసుకున్నారు. ఇటీవల ఆ తల్లీకూతుళ్ళకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ ట్విట్టర్‌లో అభినందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుక్కడయూరు కావేరి కాల్వ దగ్గర జరగుతున్న మరమ్మతు పనులను పరిశీలించిన అనంతరం కారులో వెళ్తూ ఆ ఊరిలోనే ఆ తల్లీకూతుళ్లు ఉన్నారని అధికారులు తెలుపటంతో వెంటనే అక్కడికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. మందీ మార్బలంతో ముఖ్యమంత్రి డాక్టర్‌ విజయలక్ష్మి నివాసానికి చేరుకున్నారు. ఊహించని విధంగా సీఎం తమ ఇంటికి రావడంతో రమణి, ఆమె కుమార్తె డాక్టర్‌ విజయలక్ష్మి సంతోషానికి పట్టపగ్గాలు లేకపోయింది. ఈ సందర్భంగా తల్లీకూతుళ్లతో మాట్లాడిన స్టాలిన్‌ డాక్టర్‌గా పేదలకు సేవలందించాలని విజయలక్ష్మికి సూచించారు.

Updated Date - 2022-06-01T16:27:51+05:30 IST