కరోనా x తిరోనా

ABN , First Publish Date - 2021-05-15T05:58:19+05:30 IST

కేవలం మంత్రంతో దర్భను దారుణ బ్రహ్మాస్త్రం చేసి అపాండవం గావించడానికి ఆనాడు అశ్వత్థామ ప్రయోగించినట్లే...

కరోనా x తిరోనా

కేవలం మంత్రంతో

దర్భను దారుణ బ్రహ్మాస్త్రం చేసి

అపాండవం గావించడానికి

ఆనాడు అశ్వత్థామ ప్రయోగించినట్లే

ఈనాడు కుటిల కుతంత్రంతో

కంటికి కనబడిన జటిల కరోనా మహమ్మారిని

జీవాయుధపు ‘చెయిను’లా మలచి

‘ఛీనా’ అశ్వత్థామలు మానవాళిని మటుమాయంచేసే

ప్రయోగాలు గావిస్తున్నారు

ప్రపంచాన్ని వణికిస్తున్నారు

మానవ సంబంధాలకు దూరమై

మరణానంతరం కూడ ఘోరమై

మసలే పరిణామాల్ని కల్పిస్తున్నారు

ఆనాటి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని

అర్జునుడు బ్రహ్మాస్త్రంతోనే అణచినట్లు

‘అర్జంటు’గా మనం అపర అర్జునులుగా మారి

కరోనాకు విరుగుడుగా విలోమంగా

తిరోగమన ‘తిరోనా’ను సృష్టించి ఎదుర్కోవాలి

అంతవరకు ఉపశమనంగా

అందరికీ ‘టీకా’లే శరణ్యం!

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం

నిఖిల జగం శవారణ్యం!!


–- డా. వడ్డేపల్లి కృష్ణ

Updated Date - 2021-05-15T05:58:19+05:30 IST