ఆందోళన వద్దు.. అవగాహనే ముద్దు

ABN , First Publish Date - 2020-03-29T09:32:18+05:30 IST

కరోనా పట్ల ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, వైరస్‌ లక్షణాలు వ్యాప్తి తీరుపై అవగాహన పెంచుకోవాలని ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్వీకే ప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పోలవరపు ఫణిధర్‌ సూచించారు.

ఆందోళన వద్దు.. అవగాహనే ముద్దు

అసత్య వార్తలను నమ్మొద్దు

ప్రజలకు ఐఎంఏ రాష్ట్ర శాఖ సూచనలు


(విజయవాడ, ఆంధ్రజ్యోతి): కరోనా పట్ల ప్రజలు భయాందోళనలకు గురికావద్దని,  వైరస్‌ లక్షణాలు వ్యాప్తి తీరుపై అవగాహన పెంచుకోవాలని ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్వీకే ప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పోలవరపు ఫణిధర్‌ సూచించారు. కరోనా వైరస్‌పై వస్తున్న రకరకాల వార్తలను విని అపోహ లకు గురికావద్దన్నారు. ఐఎంఏ వంటి శాస్త్రీయ సంస్థల సూచనలనే పరిగణనలోకి తీసుకోవాలంటూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్‌ సోకిన రోగి ముక్కు, నోటి నుంచి వచ్చే తుంపర్లు వస్తువులపై పడితే మూడు గంటల నుంచి కొన్ని రోజుల వరకు వ్యాధి కారకంగా ఉంటుందన్నారు.


ఆ వస్తువులను తాకిన వారి చేతుల నుంచి ముక్కు, నోరు, కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందన్నారు. ఈ వ్యాఽధికి నిర్థిష్టమైన మందు, నివారణ టీకా కాని లేవన్నారు. ప్రచారంలో ఉన్న ఏ మందునైనా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలన్నారు.  వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే భౌతికంగా కనీసం మూడు అడు గుల సామాజిక దూరాన్ని పాటించడం, చేతులు పరి శుభ్రంగా ఉంచుకోవడం అనే మౌలిక అంశాలే కీలక మన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడవద్దని, నిత్యావ సర వస్తువులను ప్రణాళికాబద్ధంగా వాడుకోవడంతోపాటు ప్రతి దానికీ బజారుకు వెళ్లవద్దని వైద్యులు సూచించారు. ఇతరత్రా జబ్బులతో బాధపడుతుంటే ఫోన్‌లోనే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరారు. ‘మీ ఇంట్లో మీరు ఉండండి.. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడండి.. దేశాన్ని రక్షించండి’ అని ఐఎంఏ విజ్ఞప్తి చేస్తుందని, ప్రజలకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా ఐఎంఏ ముందు ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 


టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

దేశవ్యాప్త ఆధునిక వైద్య విధానం(ఆల్లోపతి) వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద సంఘం ఇండియన్‌ మెడి కల్‌ అసోసియేషన్‌. ఐఎంఏ తరఫున కరోనాపై జాతీయ కరోనా టాస్క్‌ఫోర్సును కూడా ఏర్పాటు చేశారు. ఈ టాస్క్‌ ఫోర్సులో డాక్టర్‌ పొట్లూరి గంగాధరరావు సభ్యులుగా ఉన్నారు. 


Updated Date - 2020-03-29T09:32:18+05:30 IST