నన్ను వేరే ఆస్పత్రికి మార్చండి

ABN , First Publish Date - 2020-05-29T07:50:20+05:30 IST

విశాఖ మానసిక వైద్యశాలలో సంబంధం లేని మందులిస్తున్నారని, ఆ ఆస్పత్రి చికిత్సపై నమ్మకం

నన్ను వేరే ఆస్పత్రికి మార్చండి

మీ పర్యవేక్షణలో నాకు వైద్యం చేయించండి

సైకోలా మార్చే మందులు వేస్తున్నారు

హైకోర్టును అభ్యర్థించిన డాక్టర్‌ సుధాకర్‌


అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): విశాఖ మానసిక వైద్యశాలలో సంబంధం లేని మందులిస్తున్నారని, ఆ ఆస్పత్రి చికిత్సపై నమ్మకం లేని తనను మెరుగైన చికిత్స కోసం తక్షణం వేరే ఆస్పత్రికి తరలించి, కోర్టు పర్యవేక్షణలో వైద్యం అందించేలా ఆదేశాలు జారీచేయాలంటూ నర్సీపట్నం ఆస్పత్రిలో అనస్థీషియా నిపుణుడిగా పని చేసిన డాక్టర్‌ సుధాకర్‌ హైకోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు అందిస్తున్న చికిత్సపై ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశానని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సీపీ, విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌లను పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-29T07:50:20+05:30 IST