చైనా, బ్రెజిల్‌లలో... వ్యాపారాభివృద్ధికి... Dr. Reddy's ప్రణాళికలు

ABN , First Publish Date - 2022-06-25T02:11:39+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్(DRL) దీర్ఘకాలిక థెరపీ విభాగంలో దృష్టి సారించింది.

చైనా, బ్రెజిల్‌లలో... వ్యాపారాభివృద్ధికి...  Dr. Reddy's ప్రణాళికలు

హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్(DRL) దీర్ఘకాలిక థెరపీ విభాగంలో దృష్టి సారించింది. తద్వారా దేశీయ మార్కెట్‌లోని టాప్-ఐదు ఫార్మా ప్లేయర్‌లలో ఒకటిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా...  యూఎస్ ఓ ముఖ్యమైన భౌగోళికంగా కొనసాగుతున్నప్పటికీ... మరోవైపు చైనా నుండి కూడా తన ఆదాయాలను రెట్టింపు చేసుకోవడంతోపాటు, రానున్న అయిదేళ్ళలో... బ్రెజిల్‌లో కూడా ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలో... 2027 నాటికి పూర్తిస్థాయిలో వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే క్రమలో... Dr. Reddy's... ఓ  ప్రతిష్టాత్మక వ్యూహాన్ని రచించింది. దాని ఉత్పత్తుల్లో కనీసం 25 శాతం... మొదటి మార్కెట్‌కు  జెనరిక్స్‌గా ఉండనున్నాయి, అంటే... అవి ఇన్నోవేటర్ ఉత్పత్తులకు సంబంధించి సాధారణ వెర్షన్‌లుగా ఉంటాయి.  ఇది ప్రతీ ఏటా చికిత్స ప్రమాణాలను మెరుగుపరిచే మూడు వినూత్న ఉత్పత్తులను ప్రారంభించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. 


డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్(DRL) సంబంధిత Co Chairman & Managing Director జీవీ ప్రసాద్ మాట్లాడుతూ... ‘భారత్‌లో మనకు తక్కువ ప్రాతినిధ్యం ఉన్న దీర్ఘకాలిక మార్కెట్‌లో మా వాటాను పెంచుకోవాలని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో... భారత్‌లో మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా... DRLకు కేంద్రీకృత మార్కెట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ దాని ఏకీకృత రాబడిలో దాదాపు 35 శాతానికి పైగా అమెరికాయే. కాగా...  USలోని జనరిక్స్ మార్కెట్ ఎక్కువ కంపెనీల ప్రవేశంతో పోటీ,  ధరల క్షీణతను Dr. Reddy's ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే... ఇతరత్రా కొన్ని దేశాల్లో కొత్తగా ఏర్పాటు చేసుకోవడంతోపాటు, అమెరికాలో ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవాలని Dr. Reddys భావిస్తోంది. 


Updated Date - 2022-06-25T02:11:39+05:30 IST