రూ.464 కోట్లకు బ్రాండ్ కొనుగోలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత్‌లో కార్డియోవాస్క్యులర్ (హృద్రోగ సంబం ధ) ఔషధ బ్రాండ్ ‘సిడ్మ్స’ను వినియోగించుకునేందుకు నొవార్టిస్ ఏజీతో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బ్రాండ్‌ను భారత్‌లో వినియోగించుకునేందు కు 6.1 కోట్ల డాలర్లు (దాదాపు రూ.464 కోట్లు) చెల్లిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. గుండెపోటు వచ్చిన రోగులకు ఇచ్చే వల్సార్టన్, సాక్యుబిట్రిల్ (నొవార్టి్సకు పేటెంట్ ఉంది) కాంబినేషన్ ఔషధానికి డాక్టర్ రెడ్డీస్ ఈ బ్రాండ్‌ను వినియోగించి, విక్రయిస్తుంది. ఈ టాబ్లెట్లను మూడు మోతాదుల్లో డాక్టర్ రెడ్డీస్ అందుబాటులోకి తీసుకువస్తుంది. 2022 ఫిబ్రవరితో ముగిసిన ఏడాది కాలానికి భారత్‌లో రూ.136 కోట్ల విలువైన సిడ్మస్ టాబ్లెట్స్ విక్రయం అయినట్లు అంచనా.