హైదరాబాద్/రాజేంద్రనగర్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఇండియన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అసోసియేషన్(ఐఏయూఏ) సెక్రటరీ జనరల్‌గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు నియమితుడయ్యారు.
గతంలోనూ ప్రవీణ్‌రావు అనేక జాతీయ స్థాయి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐకార్) కమిటీలలోనూ సభ్యుడిగా ఉన్నారు. ఐఏయూఏను 1967, నవంబర్ 10న స్థాపించారు. నాలుగు కేంద్రీయ, నాలుగు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు సహా మొత్తం 70 విశ్వవిద్యాలయాలు ఈ అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. కాగా, తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ప్రవీణ్‌రావు అన్నారు.