టీయూ హిందీ విభాగాధిపతిగా డాక్టర్‌ పార్వతి

ABN , First Publish Date - 2021-03-06T04:53:29+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాల యంలోని హిందీ విభాగాధిపతిగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పార్వతి నియమితులయ్యారు. వీసీ నీ తూకుమారి ప్రసాద్‌ ఆదేశాల మేరకు శుక్రవారం రిజిస్ర్టార్‌ ఆచార్య నసీం ఆమెకు నియామక ప త్రాలను అందించారు.

టీయూ హిందీ విభాగాధిపతిగా డాక్టర్‌ పార్వతి
నియామకపత్రం అందజేస్తున్న రిజిస్ర్టార్‌

డిచ్‌పల్లి, మార్చి 5: తెలంగాణ విశ్వవిద్యాల యంలోని హిందీ విభాగాధిపతిగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పార్వతి నియమితులయ్యారు. వీసీ నీ తూకుమారి ప్రసాద్‌ ఆదేశాల మేరకు శుక్రవారం రిజిస్ర్టార్‌ ఆచార్య నసీం ఆమెకు నియామక ప త్రాలను అందించారు. కాగా, ఇదివరకు హిందీ విభాగాధిపతిగా డాక్టర్‌ జమీల్‌ హైమాద్‌ వ్యవ హరించారు. పార్వతి ప్రస్తుతం టీయూ బాలికల హాస్టల్‌ వార్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు హిందీ విభాగానికి పాఠ్యప్రణాళిక సం ఘ చైర్మన్‌గా కూడా కొనసాగారు. హిందీ విభా గాధిపతిగా తనను నియమించినందుకుగాను వీ సీ, రిజిస్ర్టార్‌లకు పార్వతి ధన్యవాదాలు తెలిపా రు. పార్వతికి హిందీ విభాగాధిపతి అధ్యాపకులు ప్రవీణ బాయి, జమీల్‌ హైమద్‌ ఇతర అధ్యాపకు లు, అధ్యాపకేతరులు అభినందనలు తెలిపారు. 

ఈనెల 23 నుంచి పీజీ పరీక్షలు 

తెలంగాణ విశ్వవిద్యాలయం అనుబంధ కళా శాలల్లోని పీజీ ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఏపీఈ, ఐఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ ఎల్‌ఎల్‌ ఎం కోర్సులకు చెందిన 3, 5, 7, 9వ సెమిస్టర్‌ ఽథి యరీ రెగ్యూలర్‌ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రా రంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణాధికారు లు తెలిపారు. ఈనెల 31వరకు ఈ పరీక్షలు జరు గుతాయన్నారు. పీజీ కళాశాలల ప్రధానాచార్యు లు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని, పూర్తి వివరాల కోసం టీయూ వెబ్‌సైట్‌ సంప్రది ంచాలని వారు సూచించారు. 

15 వరకు ఎంఎడ్‌ పరీక్ష ఫీజు గడువు 

తెలంగాణ విశ్వవిద్యాలయం అనుబంధ కళా శాలల్లోని ఎంఎడ్‌ కోర్సుకు చెందిన 2వ సెమిస్టర్‌, బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 15 వరకు ఫీజు గడు వు నిర్ణయించినట్లు పరీక్షల నియంత్రణాధికారు లు తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో ఈ నెల 18 వరకు చెల్లించవచ్చని తెలిపారు. 

సమస్యలు పరిష్కరించాలని టీయూ రిజిస్ట్రార్‌కు వినతి

తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఏఫ్‌ఐ విద్యార్థి సంఘాల ఆ ధ్వర్యంలో టీయూ రిజిస్ర్టార్‌ నసీంకు వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ యూఐ ఉపాధ్యక్షుడు నవీన్‌ మాట్లాడుతూ.. క రోనా కష్టకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందు లకు గురవుతున్నా వర్సిటీ అధికారులు మాత్రం సమస్యల పరిష్కరానికి కృషి చేయడం లేదని ఆరోపించారు. విద్యార్థులకు హాస్టల్‌ వసతి కల్పి ంచకపోవడం బాధాకరమన్నారు. న్యాయశాస్త్ర విభాగంలో ఖాళీగా ఉన్న 22సీట్లను వెంటనే భ ర్తీ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కు న్యాయశాస్త్ర విభాగంలో ఖాళీగా ఉన్న సీట్ల ను పూర్తిచేయాలన్నారు. విద్యార్థుల సమస్యల ను తక్షణమే పరిష్కరించని ఎడల రాష్ట్ర ప్రభు త్వాన్ని పూర్తి స్థాయిలో స్తంభింపజేస్తామని హె చ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్‌, నాయ కులు ప్రశాంత్‌, సాయి, క్రిష్ణ, ప్రణీత్‌, తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T04:53:29+05:30 IST