బ్రిటన్‌లో తెలుగు వైద్యుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం !

ABN , First Publish Date - 2020-11-25T01:13:37+05:30 IST

బ్రిటన్‌లో తెలుగు వైద్యుడు ఘట్టమనేని హనుమంతరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన హనుమంతరావు ప్రతిష్ఠాత్మక బ్రిటన్ ఎన్‌హెచ్‌ఎస్ పార్లమెంటరీ జీవితసాఫల్య పురస్కారం దక్కించుకున్నారు.

బ్రిటన్‌లో తెలుగు వైద్యుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం !

లండన్: బ్రిటన్‌లో తెలుగు వైద్యుడు ఘట్టమనేని హనుమంతరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన హనుమంతరావు ప్రతిష్ఠాత్మక బ్రిటన్ ఎన్‌హెచ్‌ఎస్ పార్లమెంటరీ జీవితసాఫల్య పురస్కారం దక్కించుకున్నారు. యూకేలో సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా వైద్యరంగంలో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆ దేశ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించింది. కాగా, మాంచెస్టర్‌లోని క్రిస్టీ క్యాన్సర్ ఇన్సిస్టిట్యూట్‌లో హనుమంతరావు 44 ఏళ్లుగా వైద్యుడిగా కొనసాగుతున్నారు. హనుమంతరావు పేరును ఈ అవార్డుకు బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు జెఫ్ స్మిత్ నామినేట్ చేశారు. ఇక దేశవ్యాప్తంగా ఈ పురస్కారం కోసం 700 పైగా దరఖాస్తులు రాగా... తెలుగు వైద్యుడు ఘట్టమనేని ఎంపిక కావడం విశేషం. వచ్చే ఏడాది జూన్ 7న ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు.     


Updated Date - 2020-11-25T01:13:37+05:30 IST