శ్రామికులకు ఈ అపవాదు తగదు

ABN , First Publish Date - 2021-05-29T05:59:08+05:30 IST

కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు, వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాదారులు, హోటళ్లు, సెలూన్లలో పనివాళ్లు, నిత్యావసర సరుకుల డీలర్లు, పెట్రోల్ బంకుల్లో కార్మికులు, వ్యవసాయ మార్కెట్‌లో...

శ్రామికులకు ఈ అపవాదు తగదు

కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు, వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాదారులు, హోటళ్లు, సెలూన్లలో పనివాళ్లు, నిత్యావసర సరుకుల డీలర్లు, పెట్రోల్ బంకుల్లో కార్మికులు, వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలు మొదలైనవారికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. వీరంతా వైరస్ బారిన పడడానికి ఎక్కువ అవకాశాలున్నవారుగా అధికారులు భావిస్తున్నారు. తద్వారా కరోనా విషక్రిమి వ్యాప్తికి కారకులయ్యే వారుగా భావింపబడుతున్న ఈ సేవా శ్రామికులను అధికారులు ‘సూపర్ స్ప్రెడర్స్’గా పేర్కొంటున్నారు. ఇది తప్పు. సదరు వ్యక్తులు అత్యవసర సేవలు అందిస్తున్నవారు కనుక వారిని ఎస్సెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్స్‌గా పేర్కొనడం సముచితంగా ఉంటుంది. అలాకాకుండా సూపర్ స్ప్రెడర్స్‌గా ప్రస్తావించడం వారి వృత్తి గౌరవాన్ని కళంకపరచడమే అవుతుంది. వైరస్ వాహకులనే అపవాదు వారిపై వేయడం తగదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆటో, క్యాబ్ డ్రైవర్లు. వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాదారులు మొదలైన వారిని సూపర్ స్ప్రెడర్స్‌గా పేర్కొనవద్దని కోరుతున్నాను.


-డాక్టర్ డి. కిరణ్మయి

Updated Date - 2021-05-29T05:59:08+05:30 IST