డాక్టర్ అప్పారావు ఎనలేని సేవలు అందించారు: డా.గుడారు జగదీష్

ABN , First Publish Date - 2021-11-22T04:43:00+05:30 IST

డాక్టర్ అప్పారావు ఎనలేని సేవలు అందించారు: డా.గుడారు జగదీష్

డాక్టర్ అప్పారావు ఎనలేని సేవలు అందించారు: డా.గుడారు జగదీష్

ఏలూరు: (పశ్చిమగోదావరి జిల్లా) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు శని, ఆదివారాలలో ఏలూరు అశ్రం హాస్పిటల్ నందు నిర్వహించిన సమావేశంలో బర్డ్ ఆసుపత్రి మాజీ సంచాలకులు, ద్వారకా తిరుమల విర్డ్ ఆసుపత్రి ప్రస్తుత డైరెక్టర్ మరియు రమేష్ గ్రూప్ హాస్పిటల్స్ అకాడమిక్ డైరెక్టర్ డా.గుడారు జగదీష్ పాల్గొని, కాళ్ల వక్రతలు, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల గురించి వివరించారు. పలు రకాలైన కాళ్ల వంకరలు, వాటిని సరిచేసే క్రమంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి వివరించారు.


ఈ ఉపన్యాసానికి గాను, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ శాఖ తరపున ప్రముఖ వైద్యులు డా. ఎన్ అప్పారావు స్మారకార్ధం బంగారు పతకాన్ని డా. గుడారు జగదీష్‌కు బహుకరించారు. ఈ సందర్భంగా డా. జగదీష్ మాట్లాడుతూ, కృష్ణా జిల్లా మారుమూల గ్రామంలో పుట్టిన డా.అప్పారావు ఖమ్మం జిల్లా ప్రజలకు వైద్య సేవలను అందించడమే కాకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుల కుటుంబాల భద్రత కోసం ఆయన పేరు మీద డా.ఎన్. అప్పారావు కుటుంబ భద్రత పథకం ద్వారా మరణించిన ప్రతి సభ్యుని కుటుంబానికి 15 లక్షల రూపాయలు అందిస్తోందని తెలిపారు.



Updated Date - 2021-11-22T04:43:00+05:30 IST