పల్లెప్రగతి పనులు పర్యవేక్షించిన డీపీవో

ABN , First Publish Date - 2022-01-22T05:34:19+05:30 IST

మండలంలోని నేదునూర్‌ గ్రామాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య సందర్శించి పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు.

పల్లెప్రగతి పనులు పర్యవేక్షించిన డీపీవో
నేదునూర్‌లో జరుగుతున్న ఫివర్‌ సర్వేను పరిశీలిస్తున్న డీపీవో వీర బుచ్చయ్య

తిమ్మాపూర్‌, జనవరి 21: మండలంలోని నేదునూర్‌ గ్రామాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య సందర్శించి పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు. గ్రామంలోని పల్లెప్రకృతి వనం, నర్సరీ, స్మశానవాటిక, డంపింగ్‌ యార్డ్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు చెత్త సేకరణ జరగాలని, సేకరించిన చెత్తను వేరు చేయాలని, వర్మీ కంపోస్ట్‌ తయారు చేయాలని ఆదేశించారు. కొవిడ్‌ వాక్సినేషన్‌ రెండవ డోస్‌ వంద శాతం పూర్తి అయ్యేవిధంగా చూడా లన్నారు. గ్రామాల్లో ఫీవర్‌ సర్వే పగడ్బందీగా చేపట్టి లక్షణాలు ఉన్న వారికి మెడికల్‌ కిట్‌లను అందజే యాలని డీపీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ వడ్లురి శంకర్‌, ఎంపీవో కిరణ్‌ కుమార్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:34:19+05:30 IST