‘డీఎంకే కూటమి విచ్ఛిన్నానికి కుట్ర!’

ABN , First Publish Date - 2020-10-25T12:35:53+05:30 IST

డీఎంకే కూటమిని విచ్ఛిన్నం చేసేందుకే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని డీపీఐ అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్‌ విమర్శించారు. మనుస్మృతి అనే గ్రంథాన్ని నిషేధించాలని కోరుతూ స్థానిక వళ్లువర్‌ కోట్టంలో తిరుమాళవళవన్‌ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా

‘డీఎంకే కూటమి విచ్ఛిన్నానికి కుట్ర!’

చెన్నై : డీఎంకే కూటమిని విచ్ఛిన్నం చేసేందుకే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని డీపీఐ అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్‌  విమర్శించారు. మనుస్మృతి అనే గ్రంథాన్ని నిషేధించాలని కోరుతూ స్థానిక వళ్లువర్‌ కోట్టంలో తిరుమాళవళవన్‌ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమావళవన్‌ మీడియాతో మాట్లాడు తూ... మహిళలు, మానవ సమాజాన్ని హీనంగా చూసేలా ఉన్న మనుస్మృతి గ్రంథాన్ని నిషేధించాలన్నారు. తాను మహిళలను కించపరుస్తూ మాట్లాడినట్లు పలు పార్టీలు ఆరోపిస్తున్నాయని, తాను ప్రసంగించిన 40 నిమిషాల వ్యవధిలో కేవలం 40 సెకన్లు మాత్రం చూసి తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను మాట్లాడిన పూర్తి సారాంశాన్ని మహిళలు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-10-25T12:35:53+05:30 IST