గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ ఔట్‌

ABN , First Publish Date - 2021-07-03T05:30:00+05:30 IST

గూగుల్‌ ప్లే నుంచి ‘బోలో ఇండ్యా’ యాప్‌ను తొలగించారు. కాపీరైట్‌ చట్టాన్ని అతిక్రమించిందని టీసిరీస్‌ చేసిన

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ ఔట్‌

గూగుల్‌ ప్లే నుంచి ‘బోలో ఇండ్యా’ యాప్‌ను తొలగించారు. కాపీరైట్‌ చట్టాన్ని అతిక్రమించిందని టీసిరీస్‌ చేసిన ఫిర్యాదుపై గూగుల్‌ ప్లే ఈ చర్య తీసుకుంది. ఇదే విషయమై టీ సిరీస్‌ పలు మీడియా, వీడియో షేరింగ్‌ వేదికలపై ఫిర్యాదు చేసింది. నష్టపరిహారంగా మూడున్నర కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. కొన్ని కంపెనీలు టీ సిరీస్‌తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకున్నాయి.


‘బోలో ఇండ్యా’ యాప్‌ యాజమాన్యం మాత్రం ఆ దిశగా ముందుకు రాలేదు. ఫలితంగా యాప్‌ తొలగింపునకు గురైంది. నిజానికి ఇది చైనాకు చెందిన ‘టిక్‌టాక్‌’కు పోటీ ఇస్తోంది.  దీనికి డెబ్బయ్‌ లక్షల మంది వినియోగదారులు ఉండటం విశేషం. 


Updated Date - 2021-07-03T05:30:00+05:30 IST