దిగుబడి తగ్గినా పెరగని టమోటా ధరలు

ABN , First Publish Date - 2022-01-23T04:31:47+05:30 IST

మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. ఓ వైపు దిగుబడి తగ్గిపోతుంటే డిమాండ్‌ పెరిగి ధరలు పెరగాల్సింది పోయి తగ్గిపోతూనే ఉన్నాయి.

దిగుబడి తగ్గినా పెరగని టమోటా ధరలు
మార్కెట్‌లో విక్రయానికి వచ్చిన టమోటాలు

రోజు రోజుకీ క్షీణత 

మదనపల్లె టౌన్‌, జనవరి 22: మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. ఓ వైపు దిగుబడి తగ్గిపోతుంటే డిమాండ్‌ పెరిగి ధరలు పెరగాల్సింది పోయి తగ్గిపోతూనే ఉన్నాయి. మదనపల్లె మార్కెట్‌లో వారం రోజుల క్రితం కిలో టమోటా గరిష్టంగా రూ.40 నుంచి 30 వరకు కనిష్టంగా రూ.6 నుంచి 10 వరకు ధరలు పలికాయి. అప్పట్లో ప్రతిరోజూ 125 టన్నుల టమోటా విక్రయానికి వచ్చాయి. శనివారం మార్కెట్‌కు కేవలం 30 టన్నుల టమోటా మాత్రమే విక్రయానికి రాగా ధరలు కూడా ఇదే రీతిలో తగ్గిపోయాయి. కిలో టమోటా గరిష్టంగా రూ.14 మాత్రమే పలుకగా కనిష్టంగా రూ.5 మాత్రమే పలకడం గమనార్హం. దీనిపై రైతులు విస్తుపోతున్నారు. ఇదిలా వుండగా డిసెంబరు, జనవరిలో రైతులు టమోటా తోటల్లో నారు నాటుతుండటంతో ఫిబ్రవరి ఆఖరు నుంచి మదనపల్లె, వాల్మీకిపురం, కలికిరి, గుర్రంకొండ, కలకడ మార్కెట్‌లలో సీజన్‌ ప్రారంభం కానుంది. చెన్నై, తిరుచ్చి, మార్కెట్‌లలో ఆంధ్ర టమోటాకు డిమాండ్‌ వుండగా, అనంతపురం మార్కెట్‌ నుంచి టమోటా ఎగుమతి అవుతోంది.

Updated Date - 2022-01-23T04:31:47+05:30 IST