Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జి రోడ్డు గోతులమయం.. పట్టించుకోని ప్రభుత్వం

twitter-iconwatsapp-iconfb-icon
ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జి రోడ్డు గోతులమయం.. పట్టించుకోని ప్రభుత్వం

అమరావతి: ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన రవాణా కేంద్రం ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జి.. ప్రమాదాలకు నిలయంగా మారింది. కాటన్ బ్యారేజ్‌పై నిర్మించిన రోడ్డు గుంతలమయంగా తయారైంది. రోడ్డుపై వేసిన కాంక్రీట్ పెచ్చులుగా ఊడిపోయి.. ఇనుపఊచలు పైకి కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది.


ఉభయ గోదావరి జిల్లాలకు తాగు, సాగునీరు అందించడంతోపాటు రవాణా కేంద్రమైన ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జి రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది. బ్యారేజ్‌పై నిర్మించిన రోడ్డుపై గుంతలు ఏర్పాడి కంకరతేలింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధవళేశ్వరం బ్యారేజ్ రోడ్డు నిర్వహణను గాలికి వదిలేసింది. గత రెండేళ్ల నుంచి వంతెనపై ఉన్న రహదారి మరమ్మతులకు నోచుకోలేదు. రోడ్డు గుంతలమయమైనా ప్రభుత్వం పట్టించుకున్నపాపానపోలేదు. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ అద్వాన్నస్థితికి చేరింది. గోదావరి నదిపై మూడున్నర కి.మీ. మేర కాటన్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ వంతెనపై ఉన్న రోడ్డంతా గోతులమయంగా తయారైంది. చిన్నపాటి వర్షానికి గోతులు వర్షపు నీటితో నిండిపోయి రోడ్డంతా చెరువును తలపిస్తుంది. ఆ గోతుల్లో వాహనాలు పడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.