రోడ్డెక్కిన ధవళేశ్వరం పంచాయితీ

ABN , First Publish Date - 2022-08-18T06:07:08+05:30 IST

ధవళేశ్వరం పంచాయితీ రోడ్డె క్కడంతో అధికారులు దిగొచ్చారు..

రోడ్డెక్కిన ధవళేశ్వరం పంచాయితీ
రోడ్డుపై బైఠాయించి గ్రామస్థుల నిరసన

సమస్యలు పరిష్కరిస్తామని అధికారుల హామీ 

గ్రామస్థుల ఆందోళన విరమణ


ధవళేశ్వరం, ఆగస్టు 17 : ధవళేశ్వరం పంచాయితీ రోడ్డె క్కడంతో అధికారులు దిగొచ్చారు.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  గ్రామ సమస్యలు పరిష్కారం కోరుతూ గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న గ్రామస్థులు బుధవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా జనసేన జిల్లా అధ్య క్షుడు కందుల దుర్గేష్‌ పంచాయతీ వద్ద బైఠాయించారు. అధికారులు తరలివచ్చి హామీ ఇస్తేనే ముట్టడిని విరమి స్తామని డిమాండ్‌ చేశారు.దీంతో డీపీవో జగదాంబ, డీఎల్‌ పీవో జె.సత్యనారాయణ, ఎంపీడీవో రత్నకుమారి, ఈవోపీఆర్డీ ఆర్మ్‌స్ట్రాంగ్‌ పంచాయతీ వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న జేఏసీ నాయకులతో చర్చలు జరిపారు. డీపీవో జగదాంబ మాట్లాడుతూ కొద్దిరోజుల్లోనే సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. కార్యదర్శుల అవినీతిపై చర్యలు, సొమ్ము రిక వరీకి సంబంధించిన ఫైల్‌ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యా లయంలో ఉందని తెలిపారు. జేఏసీ నాయకులతో కలిసి  గురువారం ఉదయం ఊరకాలువతో పాటు పారిశుధ్యం  పరిశీలిస్తానని.. ఆపై సమస్య పరిష్కారానికి తగు చర్యలు చేపడతానని తెలిపారు. డీఎల్‌పీవో సత్యనారాయణ మాట్లా డుతూ రెండు రోజుల్లో గ్రామంలోని పందులను పట్టివేస్తా మని గ్రామస్థులు సహకరించాలని కోరారు. గత కార్యదర్శి చంద్రశేఖర్‌ పంచాయతీ రికార్డును గురువారం మధ్యాహ్నం మూడు గంటల్లోపు అప్పగించకపోతే క్రిమినల్‌ చర్యలకు ఉప క్రమిస్తామని హెచ్చరించారు. అనంతరం కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ అధికారులు సమస్యలు సకాలంలో పరిష్కరిం చకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పంచాయతీ ముట్టడి కొనసాగింది. అధికారుల స్పష్టమైన హామీలతో ఆందోళన కారులు ముట్టడిని విరమించారు. బుధవారం రిలే దీక్షల్లో టి. శ్రీను, బొబ్బిలి రామకృష్ణ, పత్తి శ్రీను, కర్రి శ్రీనివాసు, సీహెచ్‌ శ్రీనివాస్‌ పాల్గొనగా సాయంత్రం టీడీపీ  నాయకుడు గోరంట్ల రవిరామ్‌ కిరణ్‌ విచ్చేసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు.ఆందోళనలో  జేఏసీ నాయకులు పండూరి అప్పా రావు, ఒంటెద్దు స్వామి, ఎడ్ల మహేష్‌, నూకల రామకృష్ణ ప్రసాద్‌, షేక్‌ అమీనా, పన్నాల వెంకటలక్ష్మి, ఎం. భీమేశ్వర రావు, ముత్యాల పోసికుమార్‌, మటపర్తి నాగరాజు, విన్నకోట సత్తిబాబు, నాయకులు పిన్నంటి ఏకబాబు, యర్రమోతు ధర్మరాజు, సావాడ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T06:07:08+05:30 IST