అనుమానం పెనుభూతమై..

ABN , First Publish Date - 2022-08-03T05:48:24+05:30 IST

భార్యపై పెంచుకున్న అనుమానం.. ఇద్దరి జీవితాలను బుగ్గిచేసింది. వివాహమైన నెలన్నరకే అనుమానం పెంచుకుని భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. ఆపై భయంతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

అనుమానం పెనుభూతమై..
పెళ్లినాటి ఫొటో (ఫైల్‌), మంచం పైమృతి చెందిన పుష్ప, క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న హరీష్‌

భార్యను గొడ్డలితో నరికిచంపిన భర. ్త
ఆపై భయంతో తాను కూడా ఆత్మహత్య
పెళ్లయిన 45 రోజులకే ఘటన
ఆత్మకూరులో విషాదఛాయలు
యువతి స్వస్థలం ఏపీ రాష్ట్రం

ఆత్మకూరు, ఆగస్టు 2: భార్యపై పెంచుకున్న అనుమానం.. ఇద్దరి జీవితాలను బుగ్గిచేసింది. వివాహమైన నెలన్నరకే అనుమానం పెంచుకుని భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. ఆపై భయంతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరి జిల్లా ఎటపాక మండ లం గౌరీదేవిపేటకు చెందిన మల్లెల శ్రీదేవి-నర్సింగరావు దంపతులకు నలుగురు కూతుళ్లు. వీరి పెద్ద కుమార్తె పుష్ప అలియాస్‌ గౌరి(18). అలాగే హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన తాళ్ల రమే్‌ష-మల్లికాంబ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. పెద్ద కుమారుడు హరీశ్‌(26) కూలి పనులు చేస్తుండేవాడు. హరీశ్‌ తల్లి 15 యేళ్ల కిందట అనారోగ్యంతో మరణించగా, తండ్రి రమేష్‌, సోదరుడు రాజు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో తమ బంధువులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరి జిల్లా ఎటపాక మండలం గౌరిదేవిపేటలో ఉండటంతో హరీశ్‌ అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లుతుండేవాడు. ఈ క్రమంలో పుష్పను ప్రేమించాడు. బంధువుల సహకారంతో వారి కుటుంబసభ్యులను ఒప్పించి 45 రోజుల కిందట వివాహం చేసుకున్నాడు. ఆత్మకూరులోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.  

అనుమానం
పెళ్లయిన 25 రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. హరీశ్‌ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 20 రోజుల కిందట ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో హరీశ్‌ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించగా కోలుకొని ఇంటికి తిరిగివచ్చాడు. దీంతో పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరిగింది. హరీశ్‌ ప్రవర్తన బాగా లేదని, పుష్పను ఇంటికి తీసుకపోతామని బంధువులు చెప్పారు. అయితే తప్పంతా తనదేనని, ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుం డా భార్యను మంచిగా చూసుకుంటానని హరీశ్‌ బం ధువులకు మాటిచ్చాడు. హరీశ్‌ తరపు పెద్దమనుషు లు సైతం ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడంతో పుష్ప కు ఆమె బంధువులు సర్దిచెప్పారు. ఇకనైనా మంచిగా ఉండాలని చెప్పి వెళ్లిపోయారు. అయితే హరీశ్‌కు భార్యపై అనుమానం పోలేదు. పైకి మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఆమెను అనుమానంతోనే చూసేవాడు.

గొడ్డలితో నరికి..
రెండు రోజుల కిందట ములుగు జిల్లా మహ్మద్‌గౌస్‌పల్లిలో ఉంటున్న హరీశ్‌ సోదరి పొలంలో నాటు వేయడానికి తండ్రి తాళ్ల రమేష్‌, తమ్ముడు రాజు వెళ్లారు. దీంతో ఇంట్లో భార్యభర్తలు హరీష్‌, పుష్ప తప్ప ఎవరూ లేరు. ఈ క్రమంలోనే పుష్పను హత్య చేయాలని హరీశ్‌ నిర్ణయించుకున్నాడు. కొన్నిరోజులుగా తనతో భర్త బాగానే ఉంటున్నాడని భావించిన పుష్ప సోమవారం రాత్రి నిద్రపోయింది. ఇదే అదునుగా గాఢనిద్రలో ఉన్న భార్య మెడపై అర్ధరాత్రి తర్వాత హరీశ్‌ గొడ్డలితో దాడిచేశాడు. విచక్షణారహితంగా తల, శరీరంపై నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత  భార్య తరపు బంధువులు తనను చంపుతారేమోనన్న భయంతో  ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగాడు. ఇంటిబయటకు వచ్చి అక్కడే మృతిచెందాడు. మంగళవారం తెల్లవారుజామున ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

పరకాల ఏసీపీ శివరామయ్య, ఆత్మకూరు సీఐ గణేష్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పుష్ప కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఏసీపీ శివరామయ్య మాట్లాడుతూ.. మొదటి నుంచీ హరీశ్‌ ప్రవర్తన విచిత్రంగా ఉన్నట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. పెళ్లయిన నాటి నుంచే భార్యపైన అనుమానం పెంచుకున్నాడని, బంధువులతో మాట్లాడినా, చుట్టుపక్కల వారితో మాట్లాడినా అనుమానపడే వాడని తెలిపారు. రోజు రోజుకూ అనుమానం మరింత పెరగడంతో ఉన్మాదిగా మారి  మంగళవారం తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో భార్యను హత్య చేశాడని చెప్పారు. కాగా, ఇద్దరి మృతదేహాలను వరంగల్‌ ఎంజీఎంకు తరలించామని ఏసీపీ తెలిపారు.

మిన్నంటిన రోదనలు

పుష్ప మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శ్రీదేవి, నర్సింగరావు కన్నీరుమున్నీరుగా విలపించారు. పుష్ప మృతదేహాన్ని పోలీసులు ఎంజీఎం మార్చురీకి తరలించగా, గౌరీదేవిపేట నుంచి కుటుంబసభ్యులు, బంధువులు ఎంజీఎం మార్చురీకి వచ్చారు. రక్తపు మరకలతో ఉన్న కూతురిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. నలుగురు ఆడపిల్లల్లో పుష్ప ఎంతో చురుకైందని, చెల్లెళ్లను బాగా చదివించాలని ఎప్పు డూ తమకు చెప్పేదని విలపించారు. కాగా, శ్రీదే వి, నర్సింగరావు దంపతులకు  నలుగురు ఆడపిల్ల లు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం కావడం తో  కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశా ల్లో చదివిస్తున్నారు. పుష్ప చురుకైన విద్యార్థి అని, ఇంటర్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిందని బంధువులు తెలిపారు.

Updated Date - 2022-08-03T05:48:24+05:30 IST