అమెరికాలో భారతీయులకు వరుస షాకులు..

ABN , First Publish Date - 2022-09-17T03:48:59+05:30 IST

అమెరికాలో భారతీయులకు వరుస షాకులు..

అమెరికాలో భారతీయులకు వరుస షాకులు..

ఎన్నారై డెస్క్: డాలర్‌తో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులవడం భారతీయులకు కొత్తేమీ కాదు. అయితే.. ఇటీవల కాలంలో డాలర్ బలపడటం మనోళ్లుకు..ముఖ్యంగా అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. రూపాయి విలువ తగ్గడంతో మునుపటి కంటే ఎక్కువ మొత్తంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సి వస్తోంది. భవిష్యత్తులో అమెరికా చదువుల కోసం ప్లాన్ చేద్దామనుకుంటున్న వారికీ ఇది ఆందోళన కలిగిస్తోంది. ఇది చాలదన్నట్టు..అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం మరిన్ని సమస్యలకు తెచ్చిపెడుతోంది. 


పైచదువులకు అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయులు ఈ పరిణామాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. అమెరికాతోపాటూ అనేక విదేశీ యూనివర్శిటీలు భారతీయులకు రెడ్ కార్పెట్‌తో ఆహ్వానం పలుకుతున్నప్పటికీ.. అనేక మంది డాలర్ మారకం విలువ, ద్రవ్బోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల రూపాయితో పోలిస్తే డాలర విలువ ఏకంగా 80 రూపాయలను తాకడం అనేక మందిని ఆందోళనకు గురిచేసింది. తమ పిల్లల ఖర్చులు ఎలా భరించాలో అర్థంకాక అనేక మంది తలలు పట్టుకున్నారు. 


ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు డాలర్ బటపడటం ఉపయోగకరంగా మారింది. మునుపటి కంటే ఎక్కువ మొత్తంలో వారు భారత్‌కు డబ్బు పంపించగలుగుతున్నారు. ఇటీవలే చదువు పూర్తి చేసుకుని కొత్తగా జాబ్‌లో చేరిన వారికి ఇది వరంగా మారింది. అయితే..డాలర్ విలువ ఎగుడుదిగుడలను తట్టుకునేందుకు అమెరికాలోని భారతీయ విద్యార్థులు అనేక మంది పార్ట్‌టైం ఉద్యోగాలపై ఆధారపడుతున్నారు. తల్లిదండ్రులపై భారం తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. డాలర్లలో లోన్ తీసుకుని చదువుకుంటున్నారు..యూఎస్‌లో ఉద్యోగం చేసుకునేందుకు వీసా రాకపోతే ఏంచేయాలో అని మధన పడుతున్నారు. అమెరికాతో పాటూ ఆస్ట్రేలియాలో చదువుతున్న వారినీ ఈ సమస్య వేధిస్తోంది. అప్పోసోప్పో చేసి కన్నపిల్లలను అమెరికాకు పంపిస్తున్న భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-09-17T03:48:59+05:30 IST