చండ్రుగొండ: కరోనా వ్యాక్సినేషన్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ వృద్ధురాలికి ప్రాణం మీదికి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం పోకలగూడెంలోని వ్యాక్సిన్ సెంటర్కు శనివారం బానోత్ సక్రీ (70)ని కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ వేయించేందుకు తీసుకొచ్చారు. అక్కడ వ్యాక్సిన్ వేస్తున్న నర్సు.. సక్రీకి ఒక డోస్ వ్యాక్సిన్ ఇచ్చింది. వృద్ధురాలు అక్కడే కూర్చోగా.. ఫోన్లో మాట్లాడుతున్న అదే నర్సు.. సక్రీకి రెండోసారి టీకా వేసింది. దీంతో సక్రీ అస్వస్థతకు గురైంది. అయినా వైద్య సిబ్బంది పట్టించుకోలేదని బాధితురాల కుటుంబ సభ్యులు ఆరోపించారు.