వర్షాకాలం.. డబుల్‌ ట్రబుల్‌

ABN , First Publish Date - 2020-06-07T08:26:32+05:30 IST

ఇప్పటికే కరోనాతో వణికిపోతున్న ప్రజలకు.. వర్షాకాలం వేళ డెంగీ వంటి విషజ్వరాల ముప్పు కూడా పొంచి ఉందని

వర్షాకాలం.. డబుల్‌ ట్రబుల్‌

  • కరోనానో.. డెంగీయో తేల్చలేకపోతున్న టెస్టింగ్‌లు
  •  

న్యూఢిల్లీ, జూన్‌ 6 : ఇప్పటికే కరోనాతో వణికిపోతున్న ప్రజలకు.. వర్షాకాలం వేళ డెంగీ వంటి విషజ్వరాల ముప్పు కూడా పొంచి ఉందని ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ ‘లాన్సెట్‌’ హెచ్చరించింది. సింగపూర్‌లో ఇద్దరు వ్యక్తులకు ర్యాపిడ్‌ సెరాలజికల్‌ టెస్టులు నిర్వహించగా డెంగీ పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. చికిత్సపొందుతున్న క్రమంలో వారికి మళ్లీ పరీక్షలు చేయగా కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. రెండింటికి సంబంధించిన క్లినికల్‌, లేబొరేటరీ సమాచారం దాదాపు ఒకేలా ఉండటంతో ఇన్ఫెక్షన్లను కచ్చితత్వంతో గుర్తించడంలో ఈవిధమైన పొరపాట్లు జరుగుతున్నాయని ‘లాన్సెట్‌’ తెలిపింది. ఇటీవల ముంబైలోనూ పలువురు కొవిడ్‌ రోగులకు.. డెంగీ కూడా ఉన్నట్లు తేలింది. 

Updated Date - 2020-06-07T08:26:32+05:30 IST