జిల్లాలో జోరందుకున్న ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణాలు

ABN , First Publish Date - 2020-06-06T11:32:28+05:30 IST

జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. దసరా నాటికి లక్ష ఇళ్లను పంపిణీ చే యాలని

జిల్లాలో జోరందుకున్న ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణాలు

నిజామాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. దసరా నాటికి లక్ష ఇళ్లను పంపిణీ చే యాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాలో కూడా ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టారు. మంజూరైన ఇళ్లను పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అధికారులు కా ంట్రాక్టర్‌లతో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం జరిగే విధంగా చూస్తున్నారు. నిర్మాణం అయిన ఇళ్లను పంపిణీ చేస్తున్నారు. దసరా నాటికి నిర్మాణం పూర్తయి న ఇళ్లను అన్నింటినీ పేదలకు అందించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 9,550 ఇళ్లు మంజూరయ్యాయి.


వీటిలో బోధన్‌ నియోజకవర్గానికి 1712, బాన్సువాడకు 1,640, నిజామాబాద్‌ రూరల్‌కు 1,536, నిజామాబాద్‌ అర్బన్‌ కు 2,330, ఆర్మూర్‌కు 1,532, బాల్కొండ నియోజకవర్గా నికి 800 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిని నాలుగేళ్ల  క్రి తం ప్రభుత్వం మంజూరు చేయగా వివిధ కారణాలతో కాంట్రాక్టర్‌లు వెనకడుగు వేయగా ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో ఈ మధ్యనే నిర్మాణాల్లో వేగం పె రిగింది. జిల్లాలో మొత్తం 6,130 ఇళ్లకు టెండర్‌ కాగా వీ టి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వ రకు 886 ఇళ్లు పూర్తయ్యాయి. బాన్సువాడ నియజకవ ర్గం పరిధిలో మొత్తం 1,640 ఇళ్లకు గాను 440 ఇళ్లు పూ ర్తయ్యాయి. వీటిలో 40 ఇల్లు కోటగిరి మండలం రాం గంగానగర్‌లో శుక్రవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రె డ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశా రు. నిజామాబాద్‌ అర్బన్‌ పరిధిలో 396 ఇళ్లు పూర్తయ్యాయి. రూరల్‌ నియోజకవర్గం పరిధిలో 50 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిని త్వరలోనే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


నిరుపేదలకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఇవే కాకుండా 3,003 ఇళ్ల నిర్మాణం కొలిక్కి వస్తోంది. ఈ ఇళ్లు 1, 2 నెలల్లో పూర్తి అయ్యే అవకాశం ఉంది. వీటిని కూడా దసరాలోపు పూ ర్తిచేసి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 2,242 ఇళ్లను త్వరలో మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ వచ్చిన తర్వాత పేదలకు డ బుల్‌ బెడ్‌రూం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తున్నారు. మొదట పెద్ద కాంట్రాక్టర్‌లు టెండర్‌లు వేసి నిర్మాణానికి ముం దుకు రాకపోవడంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే ల చొరవతో వీటిని చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చి పూర్తిచేస్తున్నారు.


దసరా నాటికి ఎక్కువ ఇళ్లను పేదలకు అందిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదే శాలు రావడం నిధులు కూడా విడుదలవుతుండడంతో నిర్మాణ వేగం పెంచామని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. త్వరగా  నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూ ర్తిచేస్తామని తెలిపా రు. మొత్తంగా జిల్లాలో డబుల్‌ బెడ్‌రూంల కోసం ఎదురుచూస్తున్న పేదల కోరిక దసరా నాటికి కొంత తీరనుంది. 

Updated Date - 2020-06-06T11:32:28+05:30 IST