Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాకౌట్‌కు సింధు, లక్ష్యసేన్‌

రెండో మ్యాచ్‌లో శ్రీకాంత్‌ ఓటమి

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌

బాలి: బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు, లక్ష్యసేన్‌ నాకౌట్‌కు చేరుకున్నారు. అయితే, రెండో మ్యాచ్‌లో ఓడడంతో కిడాంబి శ్రీకాంత్‌ నాకౌట్‌ చాన్స్‌పై సస్పెన్స్‌ నెలకొంది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-ఎలో గురువారం జరిగిన తన రెండో మ్యాచ్‌లో సింధు 21-10, 21-13తో యవోన్నీ లీ (జర్మనీ)పై గెలిచింది. తన గ్రూప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గడంతో సింధు టాప్‌-2లో చోటు ఖరారు చేసుకుంది. గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో పోర్న్‌పవీ చొచువోంగ్‌తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌-ఎలో ఒలింపిక్‌ చాంప్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌తో పోరులో లక్ష్యసేన్‌ 15-21, 14-21తో ఓటమిపాలయ్యాడు. 

అయితే, తన గ్రూప్‌ లోని జపాన్‌ స్టార్‌ మొమోటా, డెన్మార్‌ ప్లేయర్‌ రాస్‌మస్‌ గమ్కే గాయాల కారణంగా తప్పుకోవడంతో రెండో స్థానంతో లక్ష్యసేన్‌కు సెమీస్‌ బెర్త్‌ ఖరారైంది. గ్రూప్‌-బిలో తన రెండో మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 18-21, 7-21తో కున్లావుట్‌ విటిడ్‌శర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడాడు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో రెండో లీ జి జియాతో తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌ గ్రూప్‌-ఎలో ఆడాల్సిన సాత్విక్‌ -చిరాగ్‌ ద్వయం గాయం కారణంగా టోర్నీనుంచి వైదొలగింది. మహిళల డబుల్స్‌ గ్రూప్‌-బిలో అశ్విని-సిక్కి జంట 19-21, 20-22తో బల్గేరియా జోడీ గాబ్రియెలా-స్టెఫానీ చేతిలో ఓడింది. 

Advertisement
Advertisement