Abn logo
Apr 16 2021 @ 01:50AM

10 రాష్ట్రాల్లో డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ కల్లోలం

తొలుత మహారాష్ట్రలోనే కనిపించిన డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ (రెండు ఉత్పరివర్తనాలు జరిగిన కరోనా వైరస్‌).. ఇప్పుడు 10 రాష్ట్రాల్లో పంజా విసిరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపు 1,40,000 నమూనాలను విశ్లేషించి శాస్త్రజ్ఞులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ తదితర పది రాష్ట్రాల్లో ఈ డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ ఉన్నట్టు వారు చెబుతున్నారు. ఆ పదిరాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి ఇదే కారణమని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.


సాధారణంగా ఏ వైర్‌సలోనైనా ఉత్పరివర్తనాలు జరగడం సహజం. అలా మ్యుటేట్‌ అయిన రెండు వైర్‌సలు కలిసి మూడో వైర్‌సగా రూపొందితే దాన్ని డబుల్‌ మ్యుటెంట్‌ వైర్‌సగా పేర్కొంటారు. ప్రస్తుతం ఈ పదిరాష్ట్రాల్లో కనిపిస్తున్న డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌.. ఈ484క్యూ, ఎల్‌452ఆర్‌ రకాల కలగలుపు. వీటిలో ఎల్‌452ఆర్‌ వేరియంట్‌ మూలం అమెరికాలోని కాలిఫోర్నియా కాగా, ఈ484క్యూ మనదేశంలో గుర్తించిన వేరియంట్‌. పెరుగుతున్న కరోనా మరణాలకు కూడా ఈ డబుల్‌ మ్యుటెంట్‌ వైరసే కారణమా అనే అంశంపై కూడా శాస్త్రజ్ఞులు దృష్టిసారించారు. ఇలా డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఆ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. 


Advertisement
Advertisement
Advertisement