కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని రెట్టింపు చేయండి.. పిలుపునిచ్చిన యూఎన్ చీఫ్

ABN , First Publish Date - 2021-05-14T00:45:32+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహహ్మారి అల్లాడిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని రెట్టింపు చేయాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు.

కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని రెట్టింపు చేయండి.. పిలుపునిచ్చిన యూఎన్ చీఫ్

న్యూయార్క్: ప్రపంచాన్ని కరోనా మహహ్మారి అల్లాడిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని రెట్టింపు చేయాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. అదే సమయంలో వ్యాక్సిన్ సరఫరాలో కూడా సమతుల్యం ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. కరోనా పరిస్థితి గురించి మాట్లాడిన ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. అలాగే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలేమో తమ జనాభాలో అత్యధిక శాతానికి వ్యాక్సిన్ వేయించుకొని, అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం ఒక్క డోస్ వ్యాక్సిన్‌ను కూడా పొందలేని పరిస్థితి హర్షణీయం కాదన్న ఆయన.. అలాంటి ప్రపంచంలో బతకడం కూడా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-14T00:45:32+05:30 IST