అర్హులైన వారికే డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు

ABN , First Publish Date - 2022-01-25T05:54:21+05:30 IST

పట్టణంలో ఉన్న అర్హులైన నిరుపేదలకు మాత్రమే డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు.

అర్హులైన వారికే డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల దరఖాస్తులను స్వీకరిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ  

ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల పరిశీలన 

దరఖాస్తుల స్వీకరణ 

ఖానాపూర్‌, జనవరి 24 : పట్టణంలో ఉన్న అర్హులైన నిరుపేదలకు మాత్రమే డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. సోమవారం ఖానాపూర్‌లో పర్యటించిన జిల్లా కలెక్టర్‌ స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి పట్టణ శివారులో నిర్మాణం పూర్తైన డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డబుల్‌బెడ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తైన నేపథ్యంలో మిగతా సౌకర్యాలను సైతం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక 11వ వార్డులో మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేంధర్‌ అధ్యక్షతన నిర్వహించిన డబుల్‌బెడ్‌ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి కలెక్టర్‌ ముషారఫ్‌అలీఫారూఖి, ఎమ్మెల్యే రేఖానాయక్‌లు ముఖ్య అథితులుగా హాజరై నిరుపేదల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పట్టణం మొదటి దఫా 400 ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యిందని తొలుత దరఖాస్తులు వచ్చిన వారి నుంచి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. దశలవారీగా జనవరి 27వ తేదీ నుండి పట్టణంలోని ఆయా వార్డుల్లో నిరుపేదల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుందన్నారు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా లబ్దిదారులను ఎంపిక చేసి వారికి డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఖానాపూర్‌ పట్టణం నూతనంగా మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచి ఎన్నో అభివృద్ది పనులు జరిగాయన్నారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ పార్కును కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ పుప్పాల శంకర్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఖలీల్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ గొర్రె గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ జడ్‌పీటీసి రాథోడ్‌ రామునాయక్‌, ఆకుల వెంకాగౌడ్‌, రైతుబందు సమితి జిల్లా డైరెక్టర్‌ కొక్కుల ప్రదీప్‌, జడ్పీసీఈవో సుధీర్‌, డీఆర్‌డీవో పీడీ విజయలక్ష్మీ, డీసీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ లక్ష్మీ, ఎంపీడీవో వనజ, మున్సిపల్‌ కమిషనర్‌ సంతోష్‌, స్థానిక కౌన్సిలర్‌ రాజూరా సత్యం, కుర్మశ్రీనివాస్‌, సంతోష్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు జన్నారపు శంకర్‌, రాజగంగన్న, పరిమి సురేష్‌, తూము చరణ్‌, రామిడి మహేష్‌, ఎల్ముల శోభన్‌బాబు, ద్యావతి రాజేశ్వర్‌ తదితరులున్నారు. 

Updated Date - 2022-01-25T05:54:21+05:30 IST