దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ గడువు 28 వరకు పెంపు

ABN , First Publish Date - 2021-07-25T08:21:21+05:30 IST

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన దోస్త్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ రిజిస్ట్రేషన్‌ తుది గడువును పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. మొదటి విడత రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్‌ తుది గడువును...

దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ గడువు 28 వరకు పెంపు

  • సీట్ల కేటాయింపు ఆగస్టు 4 నుంచి ప్రారంభం
  • రెండో విడత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వచ్చేనెల 5 నుంచి

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన దోస్త్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ రిజిస్ట్రేషన్‌ తుది గడువును పొడిగించినట్లు  దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. మొదటి విడత  రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్‌ తుది గడువును ఈ నెల  28 వరకు పెంచినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. సీట్ల కేటాయింపు ఆగస్టు 4 నుంచి జరుగుతుందన్నారు. సీట్లు వచ్చిన విద్యార్ధులు ఆగస్టు 5 నుంచి 9 తేదీల మధ్య ఆన్‌లైన్‌ ద్వారా రిపోర్టు చేయాలని సూచించారు. రెండో విడత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆగస్టు 5 నుంచి ప్రారంభమై 18తో ముగుస్తుందని తెలిపారు. సీట్ల కేటాయింపు ఆగస్టు 25 నుంచి ఉంటుందని, రెండోవిడత సీట్లు పొందినవారు ఆ రోజు నుంచి 31లోగా ఆన్‌లైన్‌ ద్వారా రిపోర్టు చేయాలని కోరారు. కాగా, దోస్త్‌ ద్వారా ఇప్పటివరకు 1,88,720 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు కన్వీనర్‌  లింబాద్రి పేర్కొన్నారు. కాగా,  తెలంగాణ ఎంసెట్‌కు ఇంజనీరింగ్‌ విభాగంలో 1,63,991 మంది, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ విభాగంలో 85,933 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు  ఎంసెట్‌ కన్వీనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 


Updated Date - 2021-07-25T08:21:21+05:30 IST