‘దోస్త్‌’ దరఖాస్తులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-05T04:59:08+05:30 IST

జిల్లాలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. గత నెల 28వ తేదీన ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడ్డాయి. జూన్‌ 30న ఉన్నత విద్యా మండలి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసె్‌స(దోస్త్‌)-2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మూడు విడతల్లో ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తుండగా జూలై 30 వరకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగనున్నది. ఇంటర్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు.

‘దోస్త్‌’ దరఖాస్తులు ప్రారంభం

జిల్లాలో 7 ప్రభుత్వ, 47 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 

మొదటి విడతకు చివరి తేదీ జూలై 30

అందుబాటులో 20 కోర్సుల్లో 14,000 సీట్లు 


సిద్దిపేట  క్రైం, జూలై 4 : జిల్లాలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. గత నెల 28వ తేదీన ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడ్డాయి. జూన్‌ 30న ఉన్నత విద్యా మండలి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసె్‌స(దోస్త్‌)-2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మూడు విడతల్లో ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తుండగా జూలై 30 వరకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగనున్నది. ఇంటర్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు. 

సిద్దిపేట జిల్లాలో ఉన్న 54 డిగ్రీ కళాశాలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి. వీటిలో 7 ప్రభుత్వ, 47 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలకలు ఉన్నాయి. అన్నింటిలో దోస్తు ద్వారా ప్రవేశాలు మొదలయ్యాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ ఇలా 20 కోర్సుల వరకు అందుబాటులో ఉన్నాయి. అన్ని గ్రూపులలో కలిపి 14,000 సీట్ల వరకు ఉన్నాయి. సుమారు 11,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోబోతున్నారు.


ఆన్‌లైన్‌లో దరఖాస్తు 

ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై డిగ్రీలో ప్రవేశం కోసం మీసేవకు వెళ్లి దోస్త్‌ సైట్‌లో వేలిముద్ర ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత దోస్త్‌ ఐడీ, పిన్‌ వస్తాయి. వీటిని జాగ్రత్త చేసుకోవాలి. అనంతరం ఇంటర్నెట్‌లో అప్లికేషన్‌ ఫామ్‌ ఓపెన్‌ చేసి విద్యార్థి పూర్తి వివరాలను నింపాలి. వివరాలు సరిగా ఉన్నాయో లేవో ఒకసారి పరిశీలించి సబ్మిట్‌ చేయాలి. తరువాత కాలేజ్‌ ఆప్షన్‌ ఓపెన్‌ చేసి మీకు కావాల్సిన గ్రూపు, కాలేజీని మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక చేసుకోవాలి. దీంతో పాటు సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలేజీలు ఆప్షన్‌ లో పెట్టుకోవాలి. విద్యార్థి మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రకారం సీటు అలాట్‌ అవుతుంది. కేటాయింపులో విద్యార్థి కోరుకున్న కళాశాల దొరకకపోతే, రెండోసారి కౌన్సిలింగ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అందులోనూ లభించకపోతే మూడో విడతలో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉంది. ఆన్‌లైన్‌లో తప్పుడు వివరాలు నమోదు చేస్తే ఎడిట్‌ ఆప్షన్‌ ద్వారా సరిదిద్దుకోవచ్చు. 


దోస్త్‌ షెడ్యూల్‌

మొదటి దశ వెబ్‌ ఆప్షన్లు 

జూలై 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు రూ.200

సీట్ల కేటాయింపు ఆగస్టు 6

ఆగస్టు 18 వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 

రెండో దశ వెబ్‌ ఆప్షన్లు 

ఆగస్టు 7 నుంచి 22వ తేదీ వరకు

ఆన్‌లైన్‌దరఖాస్తు ఫీజు రూ.400 

సీట్ల కేటాయింపు ఆగస్టు 27 

సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్‌సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 

మూడో దశ వెబ్‌ ఆప్షన్లు 

ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 12 వరకు

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు రూ.400

సీట్ల కేటాయింపు సెప్టెంబరు 16 

సెప్టెంబరు 22 వరకు ఆన్‌లైన్‌సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 

అన్ని దశల్లోని వారు కళాశాలలో రిపోర్టింగ్‌

సెప్టెంబరు 16 నుంచి 22 వరకు

ఓరియంటేషన్‌ సెప్టెంబరు 23 నుండి 30 వరకు

అక్టోబరు 1 నుంచి తరగతులు ప్రారంభం

Updated Date - 2022-07-05T04:59:08+05:30 IST