కరోనాపై ఆందోళన వద్దు

ABN , First Publish Date - 2020-04-04T10:08:55+05:30 IST

కరోనాపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి భరోసానిచ్చారు. గజ్వేల్‌

కరోనాపై ఆందోళన వద్దు

కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, సీపీ జోయల్‌ డేవిస్‌


గజ్వేల్‌, ఏప్రిల్‌ 3: కరోనాపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి భరోసానిచ్చారు. గజ్వేల్‌ పట్టణంలోని ఐవోసీలో శుక్రవారం సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ముజమిల్‌ఖాన్‌తో కలిసి కరోనాపై తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గజ్వేల్‌ పట్టణంలోని మహతి స్కూల్‌ ప్రాంతాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ అమర్‌సింగ్‌నాయక్‌, గడ వైద్యాధికారి కాశీనాథ్‌తో కలిసి పరిశీలించారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ, వైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ సహకరిస్తే చాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనాపై 24/7 మానిటరింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. గజ్వేల్‌ పట్టణంలోని మహతి స్కూల్‌ ఏరియా, గాజులపల్లి, అహ్మద్‌నగర్‌, మాదన్నపేటలో వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఈ గ్రామాల్లో ప్రతి రోజు హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయాలని సూచించారు. పొడిజ్వరం, దగ్గు, దమ్ములాంటివి ఉంటే వెంటనే దగ్గరలోకి ఆరోగ్య కేంద్రాన్ని, లేదా 100, 108 లేదా కలెక ్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 08457-230000కు సంప్రదించాలని కోరారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వ్యాప్తి నివారణ సాధ్యమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. వారివెంట గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఏసీపీ నారాయణ, తహసీల్దార్‌ అన్వర్‌, మునిసిపల్‌  కమిషనర్‌ కృష్ణారెడ్డి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో శ్రీదేవి, వైద్యాధికారి అశ్లేషా ఉన్నారు. 

Updated Date - 2020-04-04T10:08:55+05:30 IST