కోవిడ్ చికిత్సకు ఐవర్‌మెక్టీన్ వాడొద్దు: డబ్ల్యూ‌హెచ్‌వో

ABN , First Publish Date - 2021-05-11T22:07:15+05:30 IST

కోవిడ్ చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్ ఐవర్‌మెక్టీన్‌ను ఉపయోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ‌హెచ్‌వో) సూచించింది.

కోవిడ్ చికిత్సకు ఐవర్‌మెక్టీన్ వాడొద్దు: డబ్ల్యూ‌హెచ్‌వో

కోవిడ్ చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్ ఐవర్‌మెక్టీన్‌ను ఉపయోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ‌హెచ్‌వో) సూచించింది. కోవిడ్ చికిత్సలో ఐవర్‌మెక్టీన్ సమర్థంగా పనిచేస్తుందని, మరణ ముప్పును గణనీయంగా తగ్గిస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆమెరికా జర్నల్ ఆఫ్ థెరఫ్యూటిక్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ఐవర్‌మెక్టీన్ మాత్రలను పంపిణీ చేస్తామని గోవా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.


ఈ నేపథ్యంలో డబ్య్లూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ డా. సౌమ్య స్వామినాథన్‌ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. `ఏదైనా కొత్త వ్యాధికి వాడే మెడిసిన్‌కు కచ్చితమైన భద్రత, సమర్థత చాలా ముఖ్యం. క్లినికల్ ట్రయల్స్‌లో తప్ప కోవిడ్ చికిత్సలో ఐవర్‌మెక్టీన్ ఉపయోగించవద్దని డబ్య్లూహెచ్‌వో సిఫారసు చేసింద`ని సౌమ్య పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-11T22:07:15+05:30 IST