మామిడి పండ్లను మాగబెట్టేందుకు కాల్షియంకార్బైడ్‌ వినియోగిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-04-21T05:46:54+05:30 IST

మామిడి, అరటిపండ్లను మాగబెట్టేం దుకు నిషేధిత కాల్షియంకార్బైడ్‌ వినియోగిస్తే క్రిమినల్‌కేసులు పెట్టాలని జేసీ వెంకటమురళీ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో జేసీ మా ట్లాడుతూ జిల్లాలో వేసవిలో ప్రధాన పంటగా మామిడిపండ్లు అధికంగా దిగుమతి అవుతాయన్నారు.

మామిడి పండ్లను మాగబెట్టేందుకు కాల్షియంకార్బైడ్‌ వినియోగిస్తే చర్యలు

జేసీ వెంకటమురళీ హెచ్చరిక

ఇఽథలీన్‌తో వాడకం శ్రేయస్కరమని వెల్లడి


ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 20 : మామిడి, అరటిపండ్లను మాగబెట్టేం దుకు నిషేధిత కాల్షియంకార్బైడ్‌ వినియోగిస్తే క్రిమినల్‌కేసులు పెట్టాలని జేసీ వెంకటమురళీ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో జేసీ మా ట్లాడుతూ జిల్లాలో వేసవిలో ప్రధాన పంటగా మామిడిపండ్లు అధికంగా దిగుమతి అవుతాయన్నారు. జిల్లాలో 8523 హెక్టార్లలో మామిడి పంట, 350 హెక్టార్లలో అరటి పంటలు సాగవుతున్నాయని చెప్పారు. ఉలవపాడు, కందుకూరు, గుడ్లూరు మండలాల్లోనే మామిడిని రైతులు అధికంగా పండి స్తారని, అయితే పండ్లను మాగబెట్టేందుకు ప్రమాదకరమైన కాల్షియంకా ర్బైడ్‌ వినియోగించకూడదని స్పష్టం చేశారు. ఈవిషయంపై రైతులు, వ్యా పారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రధానంగా ఉలవపాడు జాతీయరహదారి వెంట ఉండే సుమారు 300 మామిడి దు కాణాదారులకు అవగాహన కల్పించాలన్నారు.  ఇఽథలీన్‌తో మాగబెట్టడం శ్రేయస్కరమని సూచించారు. ఎక్కడైనా నిషేధిత పదార్ధాలను వాడినట్లు నిర్ధారణ అయితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, ఏడీలు నాగరాజు, ఐ.వెంక ట్రావు, ఆర్టీవో చంద్రశేఖరరెడ్డి, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T05:46:54+05:30 IST