పేదల జేబుకు చిల్లు పెట్టొద్దు

ABN , First Publish Date - 2021-12-06T04:56:13+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో పేదల జేబుకు చిల్లు పెట్టొద్దని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోపించారు.

పేదల జేబుకు చిల్లు పెట్టొద్దు
ఓటీఎస్‌ వద్దు అంటూ నినాదాలు చేస్తున్న ముప్పిడి, తదితరులు

ఓటీఎస్‌పై మాజీ ఎమ్మెల్యే ముప్పిడి ధ్వజం


గోపాలపురం, డిసెంబరు 5: ఓటీఎస్‌ పేరుతో పేదల జేబుకు చిల్లు పెట్టొద్దని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. మండలంలోని చిట్యాల, గుడ్డిగూడెం గ్రామాల్లో గౌరవ సభ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఓటీఎస్‌ కట్టవద్దని, మీకు అండగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పేదలకు భరోసా ఇచ్చారు. పేదలకు కూడు, గూడు, నీరు, కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద న్నారు. రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతీ ఇంటికి ఉచితంగా పట్టా అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జాతీ య అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. ఓటీఎస్‌ పేరుతో బకాయిలు కట్టమని ఇబ్బందులకు గురి చేసే అధికా రులపై పేదలు తిరగబడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రొంగలి సత్యనారాయణ, చిట్యాల సర్పంచ్‌ నూతంగి సరోజిని, హరిబాబు, ఎంపీటీసీ ఆంజనేయులు, ప్రసాద్‌బాబు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చాపల రవి, వార్డు మెంబర్‌ నూతంగి దొరబాబు, ముప్పిడి అశోక్‌, కొడవటి గంగరాజు, తదితరుల పాల్గొన్నారు.


నిర్బంధ ఏకకాల చెల్లింపులు తగదు


కామవరపుకోట: కష్టాల్లో ఉన్న ప్రజలపై వన్‌టైం సెటిల్‌మెంట్‌ పేరుతో నిర్బంధ ఏకకాల చెల్లింపులు నిర్వహించడం తగదని కామవరపుకోట మండల తెలుగుదేశం అద్యక్షులు కిలారు సత్యనారాయణ అన్నారు. ఆదివారం కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామంలో గౌరవ సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నెక్కలపూడి మల్లికార్జున రావు, ఈఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యదర్శి సూరం సుధీర్‌, బీసీ నాయకులు కొప్పిశెట్టి చిన్ని పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T04:56:13+05:30 IST