విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

ABN , First Publish Date - 2022-07-07T05:50:49+05:30 IST

విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
గున్‌గల్‌లో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

యాచారం, జూలై 6: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని ఉపాధ్యాయ సంఘ జిల్లా కన్వీనర్‌ వెంకటేష్‌, యాచారం మండల టీఎస్‌ యూటీఎఫ్‌ సంఘ అధ్యక్షులు ఎస్‌.నర్సింహలు డిమాండ్‌ చేశారు. బుధవారం గున్‌గల్‌ మోడల్‌ పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8185 ఎస్‌జీటీ పోస్టులు, 1962 ప్రధానోపాధ్యాయులు, 7136 స్కూల్‌ అసిస్టెంట్‌పోస్టులు, 2043ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టులు, ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లాలో 17మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈవోలు కొనసాగుతుండడం దారుణమన్నారు. ఈనెల 7న నగరంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జంగయ్య, భాస్కర్‌, ఏమీమా, సూర్యకళ, సుజాత పాల్గొన్నారు.

శంషాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

శంషాబాద్‌, జూలై 6: పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అమ్మడాన్ని నిరస్తూ బుధవారం ఎస్‌ఎ్‌పఐ విద్యార్థి సంఘం విద్యార్థులు ధర్నా చేశారు. శంషాబాద్‌లోని శ్రీవిద్య, రవీంద్రభారతీ పాఠశాల ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు ప్రణయ్‌, చందూగౌడ్‌, కౌశిక్‌, అర్జున్‌, శివ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-07-07T05:50:49+05:30 IST