అలసత్వం వద్దు

ABN , First Publish Date - 2021-06-22T07:03:37+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. క్షేత్రసందర్శన విచ్చేసిన సీఎంకు బాలాలయంలో దేవస్థాన అర్చకబృందం, వేదపండితులు ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు.

అలసత్వం వద్దు
యాదాద్రి కొండ కింద పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీష్‌రెడ్డి తదితరులు

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి 

అధికారులకు సీఎం సూచనలు

బాలాలయంలో ప్రత్యేక పూజలు 

యాదాద్రిలో 3గంటల 44 నిమిషాలపాటు సుడిగాలి పర్యటన

యాదాద్రి టౌన్‌, జూన్‌ 21: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. క్షేత్రసందర్శన విచ్చేసిన సీఎంకు బాలాలయంలో దేవస్థాన అర్చకబృందం, వేదపండితులు ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. బాలాలయంలో సువర్ణ ప్రతిష్ఠా అలంకరమూర్తులను కేసీఆర్‌ దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. బాలాలయంలో పూజల అనంతరం అర్చకులు, వేద పండితులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి చతుర్వేద మహదాశీర్వచనం నిర్వహించారు. క్షేత్ర సందర్శనకు ఎంపీ సంతో్‌షకుమార్‌తో హెలీక్యాప్టర్‌లో విచ్చేసిన సీఎం కేసీఆర్‌కు పెద్దగుట్టపై హెలీప్యాడ్‌ వద్ద ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యాదాద్రి కొండ కింద, పైన ప్రధాన ఆలయంలో పనులు పరిశీలించారు. పనుల్లో అలసత్వం వద్దని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఆయన వెంట సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌, మంత్రులు జగదీ్‌షరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభా్‌షరెడ్డి, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, సీఎంవో కార్యదర్శి ఎంవీ భూపాల్‌రెడ్డి, ఈవో గీతారెడ్డి, ఆర్కిటెక్‌ ఆనందసాయి ఉన్నారు. 


మూడు నెలల్లో డిపో, బస్టాండ్‌ పూర్తి చేయాలి

మూడు నెలల్లో ఆర్టీసీ యాదాద్రి డిపో, బస్టాండ్‌ నిర్మాణాలు పూర్తి చేయాలని, ఇందుకు కావాల్సి నిధులు ప్రభుత్వమే మంజూరు చేస్తుందని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బస్టాండ్‌ నిర్మాణం ఆధునిక హంగులతో చేపట్టాలని, పనుల్లో ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదన్నారు. సమీక్షలో ఆర్టీసీ ఉమ్మడి జిల్లా ఆర్‌ఎం రాజేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు. అంతకు ముందు రింగ్‌రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన తమకు, స్థలాలు కేటాయించాలని నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు మిట్ట వీరేష్‌ సీఎం కేసీఆర్‌ను వేడుకున్నారు. వెంటనే వీరే్‌షను తన వాహనంలో తీసుకెళ్లి, సమస్యను తెలుసుకొని, సర్వే నెంబర్‌ 314లో ఇళ్ళ స్థలాలు కేటాయించాలని ఈవో గీతారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. 


సీఎం పర్యటన సాగిందిలా..

యాదాద్రిటౌన్‌: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుమారు 3 గంటల 44 నిముషాల పాటు పర్యటించారు. 

. సాయంత్రం 6.18 గంటలకు వరంగల్‌ నుంచి హెలీక్యాప్టర్‌లో యాదాద్రిక్షేత్రానికి అభిముఖంగా ఉన్న పెద్దగుట్ట పైకి చేరుకున్నారు. పెద్దగుట్టపైన ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిలు సీఎంకు స్వాగతం పలికారు.

. సాయంత్రం 6.26 గంటలకు పెద్దగుట్టపై నుంచి రెండో అప్రోచ్‌ గుండా కిందికి వచ్చారు.

. 6.26 గంటలకు కాన్వాయ్‌లో రింగురోడ్డు పనుల పరిశీలనకు వెళ్లారు.

. 6.36 గంటలకు పాత రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద భూనిర్వాసితులతో మాట్లాడారు.

. 6.38 గంటలకు వైకుంఠద్వారం పనులను, ప్రధాన రహదారి విస్తరణను పరిశీలించారు.

. 6.46 గంటలకు వైకుంఠద్వారం నుంచి కాన్వాయ్‌లో రహదారి విస్తరణ పనులు, కొండపై గ్రీనరీని పరిశీలిస్తూ మొదటి ఘాట్‌రోడ్‌ వద్దకు చేరుకున్నారు.

. 6.47 గంటలకు మొదటి ఘాట్‌రోడ్‌, ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను పరిశీలించారు.

. సాయంత్రం 6.50 గంటలకు గిరి ప్రదక్షిణ రహదారి, నక్షత్ర వనం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

. 6.52 గంటలకు రెండో ఘాట్‌రోడ్‌ పక్కన ఏర్పాటు చేసిన గ్రీనరీని పరిశీలించారు. 

. 7.47 గంటలకు ప్రధానాలయంలోనికి వెళ్లారు.

. 8.05 గంటలకు ప్రధానాలయం నుంచి బయటకు వచ్చారు.

. 8.08 గంటలకు కొండపైన పడమటి దిశలోని అతిథి గృహానికి విచ్చేశారు.

. 8.10 గంటలకు అతిథిగృహంలో అధికారులతో సుమారు రెండు గంటల పాటు ఆలయ విస్తరణ పనులపై సమీక్షించారు.

. రాత్రి 10.00 గంటలకు అతిథి గృహం నుంచి బయటకు వచ్చారు.

.రాత్రి 10.02కు కొండకింద రెండో ఘాట్‌రోడ్డు వద్దకు చేరుకుని కాన్వాయ్‌లో తుర్కపల్లి మీదుగా ఫామ్‌ హౌజ్‌కు తరలివెళ్లారు. 

Updated Date - 2021-06-22T07:03:37+05:30 IST