‘పేట’ను వీడని పందుల బెడద!

ABN , First Publish Date - 2021-10-20T06:29:01+05:30 IST

పట్టణంలో పందుల సంచారం తగ ్గలేదు. ఊరికి దూరంగా పందులను తరలించకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నా పెంపకందారులు పెడచెవిన పెడుతు న్నారు

‘పేట’ను వీడని పందుల బెడద!
పట్టణంలో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో సంచరిస్తున్న పందులు


  పంచాయతీ హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న పెంపకందారులు

 తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న పట్టణ ప్రజలు

 ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వేడుకోలు

పాయకరావుపేట, అక్టోబరు 19 : పట్టణంలో పందుల సంచారం తగ ్గలేదు. ఊరికి దూరంగా పందులను తరలించకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నా పెంపకందారులు పెడచెవిన పెడుతు న్నారు. ఫలితంగా పాయకరావుపేటను పందుల బెడద వీడడం లేదు. కొం తమంది పందుల పెంపకం చేపడుతూ వీధుల్లోకి వదిలిపెడుతుండడంతో వాతా వరణాన్ని పాడుచేస్తున్నాయి. దీంతో పలువురు పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. పందుల నియం త్రణకు సదరు అధికారులు చర్యలు చేపడుతున్న ప్రతిసారీ కొన్నాళ్ల పాటు కనిపించవు. ఆ తరువాత యథావిధిగా తిరుగుతున్నాయని పలువురు ఆరోపి స్తున్నారు. ఈ ఏడాది జూలైలో పందు లను పట్టుకునేందుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టగా, ఆ సమ యంలో వివాదం జరిగిన విషయం తెలిసిందే, దీంతో పందులను పదిహేను రోజుల్లో పట్టణానికి దూరంగా తరలిం చకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు పందుల పెంపకందారులు సైతం  అంగీకరిం చారు. ఫలితంగా పందుల బెడద తగ్గు తుందని అంతా ఆశించారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో పెంపకందా రులు తిరిగి పందులను పట్టణంలోకి విడిచిపెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్న తాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అంతా కోరుతున్నారు. 

Updated Date - 2021-10-20T06:29:01+05:30 IST