రౌడీల ఆగడాలను ఉపేక్షించం

ABN , First Publish Date - 2022-08-11T05:23:47+05:30 IST

రౌడీల ఆగడాలు ఉపేక్షించేది లేదని, హత్యలు, హత్యాయత్నాలు జరగకుండా నిఘా ఉంచాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాష్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

రౌడీల ఆగడాలను ఉపేక్షించం
మాట్లాడుతున్న డీఐజీ రవిప్రకాష్‌

హత్యలు, హత్యాయత్నాలు 

జరగకుండా నిఘా ఉంచండి

జూమ్‌ కాన్ఫరెన్సలో నాలుగు జిల్లాల పోలీస్‌ అధికారులతో డీఐజీ రవిప్రకాష్‌

అనంతపురం క్రైం, ఆగస్టు 10: రౌడీల ఆగడాలు ఉపేక్షించేది లేదని, హత్యలు, హత్యాయత్నాలు జరగకుండా నిఘా ఉంచాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాష్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన డీఐజీ కార్యాలయం నుంచి జూమ్‌ కాన్ఫరెన్సలో అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జి ల్లాల పోలీస్‌ అధికారులతో కేసులను సమీక్షించారు. అనంతపురం జిల్లాలోని గ్రేవ్‌ యూఐ కేసుల సమీక్షలో భాగంగా అనంతపురం టూటౌన, గుత్తి, అనంతపురం వనటౌన, రాయదుర్గం అ ర్బన, పామిడి అర్బన, గుంతకల్లు టూటౌన పోలీస్‌ స్టేషన్ల పరిధిలో జరిగిన కేసుల పురోగతి పై సీఐలతో మాట్లాడి ఛేదింపుపై దిశా నిర్దేశం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో భాగంగా గోరంట్ల, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం అర్బన, నల్లమాడ, పుట్టపర్తి రూరల్‌, కియ, హిందూపురం 1టౌన, టూటౌన, పెనుకొండ, సోమందేపల్లి, కదిరి టౌన, కదిరి రూరల్‌, హిందూపురం రూరల్‌ పోలీ్‌సస్టేషన్లపై థెఫ్ట్‌, రాబరీ కేసులపై సమీక్షించా రు. పెండింగ్‌లో ఉన్న రాబరీ తదితర గ్రేవ్‌ కేసులను త్వరగా ఛేదించాలని ఆదేశించారు. గ్రేవ్‌ ప్రాపర్టీ కేసుల్లో వందశాతం ఛేదింపు జరగాలన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఛేదింపునకు కృషి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరించారు. ధ్యాస మళ్లించి దొంగతనాలకు పాల్పడే ముఠాలపై ప్రత్యేక ని ఘా ఉంచాలని, ఆ ముఠాల ఆగడాలకు ముంద స్తు చర్యల ద్వారా అడ్డుకట్ట వేయాలని సూచించారు. కీలక రౌడీలపై ఉక్కుపాదం మోపాలన్నారు.  పాత కక్షలు, భూ వివాదాల వల్ల హత్యలు, హత్యాయత్నాలు జరగకుండా దృష్టి సారించాలన్నారు.  రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎవరెవరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో లోతుగా సమీక్షిస్తానన్నారు.  క్రైం అగనెస్ట్‌ ఉమెన ఘటనల్లో తక్షణ స్పందన, చర్యలుండాలన్నారు. ఈనెల 13న జరిగే జాతీయ లోక్‌ అదాలతలో అధిక కేసులకు పరిష్కారం చూపాలని, డీఎస్పీలు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌, చిత్తూరు ఎస్పీ రిషాంతరెడ్డి, నాలుగు జిల్లాల అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు ఆయా పోలీస్‌ కార్యాలయాల నుంచి కాన్ఫరెన్సలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:23:47+05:30 IST