డాక్టర్ మస్తాన్ యాదవ్‌ను శాలువాలతో సత్కరిస్తున్న దృశ్యం
డాక్టర్ మస్తాన్ యాదవ్
వెంకటగిరి, జనవరి 17: బయటి వ్యక్తులకు అవకాశం కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పటికే తెలిసిందని తెలుగు దేశంపార్టీ నాయకుడు డాక్టర్ బొలిగిల మస్తాన్ యాదవ్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా వెంకటగిరికి విచ్చేసిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. డాక్టర్‌గా తాను హైదరాబాద్‌లో స్థిరపడినా తను పుట్టిన ఊరి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యం పెట్టుకొన్నట్లు తెలిపారు. వెంకటగిరి రాజకుటుంబీకులు, కురుగొండ్ల రామకృష్ణ మినహా బయటి వారు ఎమ్మెల్యేలు కావడం వలన వెంకటగిరి అభివృద్ధి కుంటుబడిందన్నారు. పదేళ్లుగా స్థానికుడైన కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరికి చేసిన సేవలు ప్రశంసించదగినవన్నారు. అవకాశం వస్తే రాజకీయంగా కూడా ప్రజలకు తన వంతు సేవలందించనున్నట్లు తెలిపారు.