Abn logo
Jan 20 2021 @ 00:20AM

ఎక్కువగా తినకూడదంటే...

భోజనం మితంగా చేయాలని అనుకుంటారు. కానీ రుచికరమైన వంటలు ముందుండే సరికి ఫుల్‌గా భోంచేస్తారు. అయితే చిన్న చిన్న చిట్కాలతో మితంగా భోజనం చేసే వీలుంది. అవేమిటంటే...


అన్నం తినేముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి.


ప్రొటీన్లు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. 


 లీన్‌ ప్రొటీన్‌ బాగా తినాలి.


చిన్న ప్లేటులో ఆహారం వడ్డించుకోవడం వల్ల తక్కువ తినడానికి ఆస్కారం ఉంటుంది.


ప్యాకేజింగ్‌ ఫుడ్స్‌కి దూరం ఉండాలి.


తినే ఆహారంలో పండ్లు, పీచుపదార్థాలు, పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి.


తీపి పదార్థాలు తినాలనిపించినపుడు స్వీట్‌ డెజర్టు లాంటివి తింటే మంచిది.


ఫ్యాట్లు, షుగర్‌, ఉప్పు తక్కువగా తీసుకోవాలి.

Advertisement
Advertisement
Advertisement