చక్కెర మితంగా...

ABN , First Publish Date - 2020-08-18T18:00:04+05:30 IST

మనకు తెలియకుండానే పరిమితికి మించి చక్కెర తింటూ ఉంటాం. మనం తినే చక్కెర పరిధి దాటినట్టు కొన్ని లక్షణాలు తెలుపుతూ ఉంటాయి.

చక్కెర మితంగా...

ఆంధ్రజ్యోతి(18-08-2020)

మనకు తెలియకుండానే పరిమితికి మించి చక్కెర తింటూ ఉంటాం. మనం తినే చక్కెర పరిధి దాటినట్టు కొన్ని లక్షణాలు తెలుపుతూ ఉంటాయి.


తీపి ఆకర్షణ: తీపి తినాలనే కోరిక తరచుగా కలుగుతూ ఉంటే, పరిమితికి మించి చక్కెర తింటున్నామని అర్ధం.


ముడతలు: చర్మాన్ని బిగుతుగా ఉంచి, సాగుదలకు తోడ్పడే కొల్లాజెన్‌ మీద చక్కెర ప్రభావం ఎక్కువ. కొల్లాజెన్‌ తగ్గి, చర్మం ముడతలు పడుతుంటే చక్కెర తినడం తగ్గించాలి.


బరువు పెరగడం: శరీరం కొవ్వును నిల్వ చేసుకునే స్వభావాన్ని చక్కెర ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కొవ్వు పేరుకుపోయి, బరువు పెరుగుతాం. 


వాపులు తప్పవు: చక్కెర శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది. ఫలితంగా వాపులు, నొప్పులు వేధిస్తాయి. 


పొట్ట నొప్పి: చక్కెర పదార్థాలు జీర్ణానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దాంతో పొట్టలో వాయువులు పేరుకుని, నొప్పి మొదలవుతుంది.


పిప్పిపళ్లు: దంత సమస్యలు తరచూ వస్తుంటే చక్కెర పరిమాణం తగ్గించాలి.


Updated Date - 2020-08-18T18:00:04+05:30 IST