Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాయామం వద్దు!

ఆంధ్రజ్యోతి(08-09-2020)

వ్యాయామం ఆరోగ్యానికి అవసరమే! ప్రతి రోజూ అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయడం ద్వారా పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. అయితే కరోనా సోకినవారి విషయంలో వ్యాయామం మేలు చేయకపోగా, మరింత చేటు చేస్తుందని ఓ అధ్యయనం ద్వారా తేలింది.


జామా కార్డియాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనంలో జర్మన్‌ పరిశోధకులు... స్వల్ప కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారు తేలికపాటి వ్యాయామాలు చేసినా గుండె సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యాయామం చేయడం వల్ల కొవిడ్‌ లక్షణాలు పెరిగి, గుండె కండరాలు వాపుకు గురయ్యే మయోకార్డైటిస్‌ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని వారంటున్నారు. ఈ అధ్యయనం కోసం కొవిడ్‌ నుంచి కోలుకున్న వంద మందికి కార్డియాక్‌ ఎమ్మారై పరీక్షలు జరిపినపుడు వీరిలో సగం మందికి స్వల్పం నుంచి మధ్యస్థంగా లక్షణాలు ఉండడం, 18 శాతం మందికి లక్షణాలేవీ లేకపోవడాన్ని వీరు గమనించారు. అయితే కొవిడ్‌ సోకినట్టు నిర్థారణ అయినప్పటి నుంచి మూడు నెలల తర్వాత పరీక్షలు జరిపినప్పుడు వీరిలో ఎటువంటి గుండె సంబంధ సమస్యలు బయల్పడకపోయినా 78శాతం మంది గుండె ఆకారాల్లో తేడాలు తలెత్తడం, 60శాతం మందికి మయోకార్డైటిస్‌ ఉండడాన్ని పరిశోధకులు గమనించారు. దీన్నిబట్టి కరోనా వైరస్‌ గుండె కండరాల్లో తిష్ఠ వేసుకుని, గుండె ఏమాత్రం అలసటకు లోనైనా లోడ్‌ పెంచుకుని గుండెను దెబ్బ తీస్తుందనే నిర్థారణకు వచ్చారు.


వ్యాయామం చేసేటప్పుడు గుండె మీద ఒత్తిడి పెరిగి, గుండె కండరాల్లో వైరస్‌ సంఖ్య పెరుగుతుంది. ఈ వైరల్‌ లోడ్‌ పెరిగినప్పుడు మయోకార్డైటిస్‌, అరిథ్మియాస్‌, హార్ట్‌ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. కాబట్టి కొవిడ్‌ సోకిన వారు లక్షణాలు లేకపోయినా వ్యాయామానికి దూరంగా ఉంటూ, గుండె కొట్టుకునే వేగం ఏ కొంచెం పెరిగినా, శ్వాస అందకపోయినా వెంటనే వైద్యులను కలవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


Advertisement
Advertisement